నమస్తే

స్వాగతం

NewsOne కి స్వాగతం

Sign In / Register
హోమ్ న్యూస్ వినోదం

న్యూస్

4 వార్తలు కనుగొనబడ్డాయి

న్యూస్

రాష్ట్ర ముఖ్య‌మంత్రికి ఘ‌న స్వాగ‌తం

విశాఖపట్నం న్యూస్ One: విశాఖ జిల్లాలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐ.ఎఫ్.ఆర్.) కార్యక్రమాలలో పాల్గొనుటకు   మంగళవారం రాత్రి వాయుమార్గం ద్వారా  నగరానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రికి స్థానిక నేత‌లు మరియు అధికారుల నుంచి ఘ‌న స్వాగ‌తం లభించింది.ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన వారిలో పార్లమెంటు సభ్యులు M. శ్రీ భరత్, GVMC కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ G. విద్యాధరి, DCP మేరీ ప్రశాంతి, VMRDA కమిషనర్ తేజ్ భరత్ , నేవి అధికారులు   ఘన స్వాగ‌తం ప‌లికారు.

Rajesh Indukuri· 2 వారాల క్రితం
న్యూస్

బంగాళాఖాతంలో అల్పపీడనం..నెలాఖరున వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారం అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఈనెల 25 నుంచి 28 వరకు తెలంగాణ, ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీ రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటగా, నెలాఖరుకు గరిష్ఠంగా 40 డిగ్రీలకు చేరే సూచనలు ఉన్నాయని అధికారులు హెచ్చరించారు

Rajesh Indukuri · 2 వారాల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
న్యూస్

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు

సబ్బవరం డిడి న్యూస్ : జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సబ్బవరం లో ఈరోజు జరిగిన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రామచంద్ర పాల్గొని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ మరియు ఏ సంబంధిత పత్రం లేకుండా, బండి నడపకూడదని తగుచూచనలతో పాటు ప్రమాదం జరిగితే ఏ విధమైనటువంటి స్థాయిలో విద్యార్థులు, సహాయం చేయాలో అనేక రకాలైనటువంటి సోదాహరణలతో ఈ కార్యక్రమంలో విద్యార్థులని చైతన్యవంతం చేశారు.. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి శంకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థి గ్రూపులోనే విలాసవంతమైన జీవితం కొరకు ఆనందం కొరకు స్పీడ్ అనేదాన్ని ప్రాణాల మీదకు తీసుకొని వస్తువు కుటుంబాలతో చలగాటలాడుతున్న యువత ఈ యొక్క అవగాహన కార్యక్రమం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా విద్యార్థులకు హితోపలికారు.. ఈ కార్యక్రమంలో కళాశాల వయసు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ సత్యనారాయణ, కుమారి రజిని మరియు జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి గలీజ్ లెక్కల తదితరులు పాల్గొన్నారు.

Rajesh Indukuri · 2 వారాల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
న్యూస్

జీవీఎంసీ పరిధిలో అనధికార లేఔట్లను క్షుణ్ణంగా పరిశీలించండి

 మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో అసంపూర్ణంగా ఉన్న అనధికార లేఔట్ లలో ఎల్ఆర్ఎస్ అనుమతుల మంజూరుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, నగరంలో గల అటువంటి  అనధికారిక లేఔట్లను క్షుణంగా పరిశీలించి నివేదికను సిద్ధం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు కమిషనర్ ఆదేశించారు . గురువారం ఆయన మధురవాడ జోన్  కొమ్మాది విలేజిలో ఎ బి కె రియల్ ఎస్టేట్ సంస్థ వేసిన అనధికారిక లే అవుట్ ను జీవీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్ కే.వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శబ్నం శాస్త్రి తో కలిసి పరిశీలించారు.మధురవాడ జోన్, కొమ్మాది విలేజ్ లో సర్వేనెంబర్ 36,37 పార్ట్,65,66,67,68,69 పార్ట్,72,73 పార్ట్,88,89,90,91పార్ట్ సర్వే నంబర్ల లో 14.4  ఎకరాలలో 163 ప్లాట్లతో ఎ బి కె రియల్ ఎస్టేట్ సంస్థ వేసిన లేఔట్ లో ఎల్ఆర్ఎస్ మంజూరు కొరకు దరఖాస్తు చేసిన స్థల యజమానుల ప్లాట్లను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో సంబంధిత అనధికారిక లేఔట్ లో అంతర్గత రోడ్లు మిగిలిన రహదారులకు అనుసంధాన పరచనందున అసంపూర్ణంగా లేఔట్ ఉందని గమనించిన కమిషనర్ సంబంధిత లేఔట్ యజమానితో ఫోన్లో మాట్లాడుతూ అందుకు గల కారణాలపై ఆరా తీశారు. ఆ లేఔట్ లో కొనుగోలు చేసిన  స్థల యజమానులు ఎల్ఆర్ఎస్ పథకం మంజూరు కొరకు 83 మంది స్వయంగా దరఖాస్తు చేసుకున్నారని, అందులో 75 స్థలాల ఎల్ఆర్ఎస్ అనుమతుల మంజూరుకు సంబంధించి పరిశీలనకు రావడం జరిగిందని, స్థల యజమానులు సౌకర్యార్థం లేఔట్ లో రోడ్లు అనుసంధాన పరచనందున రాష్ట్ర ప్రభుత్వం  కల్పించిన ఎల్ఆర్ఎస్ మంజూరుకు స్థల యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారని, అనుమతుల మంజూరుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నారు. వెంటనే లేఔట్ లో గల రోడ్లను ప్రధాన రోడ్లకు అనుసంధానం చేసే ప్రక్రియ జరిపి అభివృద్ధి పరచాలని, అలా కాని ఎడల చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని కమిషనర్ రియల్ ఎస్టేట్ యజమానికి హెచ్చరించారు. విశాఖ నగరంలో ఉన్న అనధికార లేఔట్లను క్షుణ్ణంగా పరిశీలించే ప్రక్రియ చేపట్టి నివేదికను సిద్ధం చేయాలని,  ఎల్ఆర్ఎస్ మంజూరుకు అనుమతులు కోరుతూ సమర్పించిన దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని డిసిపి వెంకటేశ్వరరావుకు , ఫోన్ ద్వారా జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ .ప్రభాకర రావు కు కమిషనర్ ఆదేశించారు. 

Rajesh Indukuri · 2 వారాల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
హోమ్
లైవ్ TV
ఈ-పేపర్
Loading Live...
లైవ్ TV (Live)