మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో అసంపూర్ణంగా ఉన్న అనధికార లేఔట్ లలో ఎల్ఆర్ఎస్ అనుమతుల మంజూరుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, నగరంలో గల అటువంటి  అనధికారిక లేఔట్లను క్షుణంగా పరిశీలించి నివేదికను సిద్ధం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు కమిషనర్ ఆదేశించారు . గురువారం ఆయన మధురవాడ జోన్  కొమ్మాది విలేజిలో ఎ బి కె రియల్ ఎస్టేట్ సంస్థ వేసిన అనధికారిక లే అవుట్ ను జీవీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్ కే.వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శబ్నం శాస్త్రి తో కలిసి పరిశీలించారు.



మధురవాడ జోన్, కొమ్మాది విలేజ్ లో సర్వేనెంబర్ 36,37 పార్ట్,65,66,67,68,69 పార్ట్,72,73 పార్ట్,88,89,90,91పార్ట్ సర్వే నంబర్ల లో 14.4  ఎకరాలలో 163 ప్లాట్లతో ఎ బి కె రియల్ ఎస్టేట్ సంస్థ వేసిన లేఔట్ లో ఎల్ఆర్ఎస్ మంజూరు కొరకు దరఖాస్తు చేసిన స్థల యజమానుల ప్లాట్లను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో సంబంధిత అనధికారిక లేఔట్ లో అంతర్గత రోడ్లు మిగిలిన రహదారులకు అనుసంధాన పరచనందున అసంపూర్ణంగా లేఔట్ ఉందని గమనించిన కమిషనర్ సంబంధిత లేఔట్ యజమానితో ఫోన్లో మాట్లాడుతూ అందుకు గల కారణాలపై ఆరా తీశారు. ఆ లేఔట్ లో కొనుగోలు చేసిన  స్థల యజమానులు ఎల్ఆర్ఎస్ పథకం మంజూరు కొరకు 83 మంది స్వయంగా దరఖాస్తు చేసుకున్నారని, అందులో 75 స్థలాల ఎల్ఆర్ఎస్ అనుమతుల మంజూరుకు సంబంధించి పరిశీలనకు రావడం జరిగిందని, స్థల యజమానులు సౌకర్యార్థం లేఔట్ లో రోడ్లు అనుసంధాన పరచనందున రాష్ట్ర ప్రభుత్వం  కల్పించిన ఎల్ఆర్ఎస్ మంజూరుకు స్థల యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారని, అనుమతుల మంజూరుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నారు. వెంటనే లేఔట్ లో గల రోడ్లను ప్రధాన రోడ్లకు అనుసంధానం చేసే ప్రక్రియ జరిపి అభివృద్ధి పరచాలని, అలా కాని ఎడల చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని కమిషనర్ రియల్ ఎస్టేట్ యజమానికి హెచ్చరించారు. 

విశాఖ నగరంలో ఉన్న అనధికార లేఔట్లను క్షుణ్ణంగా పరిశీలించే ప్రక్రియ చేపట్టి నివేదికను సిద్ధం చేయాలని,  ఎల్ఆర్ఎస్ మంజూరుకు అనుమతులు కోరుతూ సమర్పించిన దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని డిసిపి వెంకటేశ్వరరావుకు , ఫోన్ ద్వారా జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ .ప్రభాకర రావు కు కమిషనర్ ఆదేశించారు.