తాజా వార్తలు (Latest)
మీ కోసం సిఫార్సు చేయబడినవి (Recommended)
ప్రభుత్వ ఎక్స్ గ్రేషియో చెక్కును బాధితలకు అందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ నిరసనలు హాస్యాస్పదం
జీవీఎంసీ పరిధిలో అనధికార లేఔట్లను క్షుణ్ణంగా పరిశీలించండి
బంగాళాఖాతంలో అల్పపీడనం..నెలాఖరున వర్షాలు
80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అక్కయ్యపాలెం సచివాలయ ఉద్యోగి పైలా రాజేష్.
రైతు భరోసా కేంద్రాలను గాలికి వదిలేసారు : జాతీయ బీసీ సంక్షేమ సంఘం
సోంపేట, అక్టోబర్ 16 (న్యూస్ వన్ ప్రతినిధి) : ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల పాత్ర అత్యంత కీలకమైనది. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు ప్రజాధనాన్ని ప్రజా సంక్షేమానికి, గ్రామీణ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలి. కానీ ప్రజల అవసరాల కోసం కోట్లాది రూపాయలతో నిర్మాణాలు చేపట్టి, వాటిని పూర్తిచేయకుండా మధ్యలోనే వదిలేయడం, ఇప్పటికే నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకురాకపోవడం ప్రజాధనంపై ప్రభుత్వాలకు ఉన్న బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా విమర్శించింది.ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు స్థలాలు కేటాయించి, అనేక ప్రాంతాల్లో భవన నిర్మాణాలు చేపట్టింది. కొన్ని భవనాలు పూర్తయినప్పటికీ, మిగిలిన పనులు పూర్తిచేయకుండా వదిలేయడంతో అవి నేటికీ నిరుపయోగంగా ఉన్నాయని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సైతం అటువంటి అసంపూర్తి భవనాల నిర్మాణాలను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంపై తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది.ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు మారుతున్నారు.. కానీ ప్రజాధనం వృథా అవుతున్న తీరు మాత్రం మారడం లేదు!శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మాకన్నపురం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని ఇటీవల సందర్శించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ సంఘసేవకురాలు డాక్టర్ సిపాన గుణవతి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ ఎల్ గోవిందరాజులు జిల్లా అధ్యక్షుడుపిట్ట పోలయ్య, జిల్లావర్కింగ్ ప్రెసిడెంట్ మడ్డు సోమశేఖర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు వైశ్య రాజు మురళి, అడ్వైజర్ దాసరి షణ్ముఖరావు, పలాస సబ్ డివిజనల్ కన్వీనర్ బంగారు విశ్వనాథం, మందస మండలం కన్వీనర్ మధుబాబు, సోంపేట మహిళా కన్వీనర్ మద్దిల వేణు పర్యటన బృందంలో ఉన్నారు. ఈ బృందానికి అక్కడి పరిస్థితులు తీవ్ర ఆవేదన కలిగించాయి. ప్రజలకు సేవలు అందించాల్సిన భవనాలు నిరుపయోగంగా ఉండటం పాలకుల అసమర్థతను ఎత్తిచూపుతున్నాయి. భవనాల ప్రాంగణంలో మౌలిక సదుపాయాలు దెబ్బతినడం, నిర్మాణాలకు సంబంధించిన సామగ్రి ధ్వంసమైనట్లు కనిపించడం పట్ల బృందం విచారం వ్యక్తం చేసింది.ప్రజల సౌకర్యార్థం నిర్మించిన భవనాలు ఉపయోగంలోకి రాకపోవడం వల్ల ప్రభుత్వానికి ప్రయోజనం లేకపోవడమే కాకుండా, కాలక్రమేణా భవనాలు శిథిలావస్థకు చేరి ప్రజాధనానికి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.రాజకీయ నాయకులకు గ్రామీణ ప్రాంతాల సమస్యలు కనిపించడం లేదా?ఈ సందర్భంగా డాక్టర్ గుణవతి ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రజల పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరే సొమ్ము ప్రజల సంక్షేమం కోసమేనని, ఆ సొమ్ముతో నిర్మించిన భవనాలను నిరుపయోగంగా వదిలేయడం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని ఆమె స్పష్టం చేశారు.ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాధనంతో నిర్మించిన భవనాలను ఎందుకు పూర్తిచేయడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో శిధిలమైన ఈ భవనాలు నాయకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.“ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ కక్షలు, పార్టీ ప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణం కావచ్చు.. ప్రజాధనంతో నిర్మించిన ప్రతి భవనం ప్రజలకే ఉపయోగపడాలి. ప్రభుత్వాలు మారాయని ప్రజల సొమ్ముతో నిర్మించిన భవనాలను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసం?” అని డాక్టర్ గుణవతి ప్రశ్నించారు.15 వేల గ్రామ సచివాలయాల నిర్మాణంపై పూర్తి వివరాలు వెల్లడించాలి :రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల గ్రామ సచివాలయాలు ఉన్నట్లు అంచనాలు ఉన్న నేపథ్యంలో, వాటి నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం సమగ్ర వివరాలను ప్రజల ముందు ఉంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.ఈ అంశాలపై సమాచారం అందించాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరుపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి శుక్రవారం ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రం అందించినట్లు డాక్టర్ గుణవతి తెలిపారు.ప్రజాధనంతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా మారితే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? నిర్మాణాలు పూర్తిచేయకుండా వదిలేసిన గత ప్రభుత్వమా? వాటిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో జాప్యం చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వమా? లేక పర్యవేక్షణలో విఫలమైన సంబంధిత అధికారులా? అనే అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని సంఘం ప్రశ్నించింది.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్మించిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోతే వాటి నిర్మాణం వెనుక ఉన్న లక్ష్యం నెరవేరనట్లేనని డాక్టర్ సీపాన గుణవతి అన్నారు.ప్రజల సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం కావాలని, రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. మాకన్నపురం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలపై కూడా సమగ్ర సమీక్ష జరపాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని డాక్టర్ గుణవతి పేర్కొన్నారు.
ఏపుగంటి వీర రాఘవులు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైసిపి నుంచి టిడిపిలో చేరిక
----పార్టీలో చేరిన వారందరినీ పసుపు కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే బండారు----స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతో రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ రాబోతోంది.వాడపల్లి : కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. వాడపల్లి మాజీ ఎంపీటీసీ ఏపుగంటి వీరరాఘవుల తో సహా 50 కుటుంబాలకు చెందినవారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో శుక్రవారం వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ పసుపు కండువాలు కప్పి ఎమ్మెల్యే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన వెంటనే కోనసీమ తిరుమల వాడపల్లిలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో ఇంతమంది చేరడం స్వామివారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉన్నాయనడానికి నిదర్శనం అన్నారు. తొలిసారిగా శాసనసభ్యునిగా పోటీ చేసినప్పటి నుంచి ఏ ఎన్నిక జరిగిన మొదట వాడపల్లి వచ్చి స్వామి వారిని దర్శించుకుని ప్రచారం మొదలుపెట్టడం తనకు ఆనవాయితీ అని ఎమ్మెల్యే బండారు గుర్తుచేసుకున్నారు. వాడపల్లి మాజీ ఎంపీటీసీ వీరరాఘవులు వారి సహచర బృందం తెలుగుదేశంలో చేరడం చాలా సంతోషకరమన్నారు.ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ఆధ్వర్యంలో రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందన్నారు. మరలా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించడం ద్వారా త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడవాలని పట్టణాలను, గ్రామాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు మూడు ఇంజన్లుగా ఒకే మాట మీద ఒకే బాటలో పయనించినప్పుడు మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు సంక్షేమం అందించడానికి గ్రామాలను అభివృద్ధి చేయడానికి కూటమి అభ్యర్థులే గెలవాలని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీలు, వార్డు సభ్యులతో సహా అన్నింటా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 2029 లో సైతం ఎన్డీఏ కూటమే అధికారంలోకి తిరిగి రాబోతుందన్నారు. అందరూ కలిసి పనిచేసి ఎన్డీఏ కూటమి తరపున ఎవరికి అవకాశం ఇచ్చినా, ఎవరు పోటీ చేస్తున్నా అందరినీ గెలిపించుకోవాలని కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ,ముదునూరి వెంకటరాజు( గబ్బర్ సింగ్ ),కరుటూరి నరసింహారావు,కాయల జగన్నాధం,కూసుంపూడి రామకృష్ణరాజు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
👉 పరిషత్ ఎన్నికలకు ఈ నెల 21నుండి నామినేషన్ల స్వీకరణ
👉 సన్నద్ధత పై సమీక్షించిన సంయుక్త కలెక్టర్ జి. విద్యాధరివిశాఖపట్నం, అక్టోబరు 16: ఎం.పి.టి.సి, జెడ్. పి.టి.సి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఈ నెల 21వ తేదీ నుండి స్వీకరించడం జరుగుతుందని, ఎన్నికలు నవంబర్ 3న, ఓట్ల లెక్కింపు 5వ తేదీన జరుగుతాయని సంయుక్త కలెక్టర్ జి.విద్యాధరి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో ఏర్పాట్లు పై జేసీ సమీక్షించారు. సజావుగా ఎన్నికల నిర్వహించుటకు గానూ నోడల్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. డివిజనల్ స్థాయి లో ఆర్.డి. ఓ లు ఇంచార్జ్ లుగా వుంటారని, అసిస్టెంట్ అథారిటీ గా ఎం.పి.డి. ఓ లు వ్యవహరిస్తారని తెలిపారు. 203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడమైందని, ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కనీస వసతులు ఉండేలా పంచాయతీ రాజ్ ఎస్.ఈ చూడాలనిసూచించారు. మోడల్ కోడ్ వెంటనే అమలులోకి వస్తుందని తెలిపారు. పార్టీల ప్రతినిధుల ఫోటోలు, ఫ్లెక్సీలు తొలగించాలని, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాలని తెలిపారు. ఎన్నికల సామాగ్రిని, పోలింగ్ అధికారులను సిబ్బందిని నియమించడం జరిగిందని, వారికి శిక్షణలు కూడా వెంటనే ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల విధులలో స్వంత తెలివితేటలను వాడకూడదని, పనులన్నీ ఇచ్చిన గడువులోగానే పూర్తి చెయ్యాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సి.ఈ. ఓ నారాయణమూర్తి, డిప్యూటీ సి.ఈ. ఓ సందీప్, ఆర్.డి. ఓ దిలీప్ చక్రవర్తి, డి.ఈ. ఓ ప్రేమ్ కుమార్, పూర్ణిమ, తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలు నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
విజయవాడ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విజయవాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ నంబర్లు: 0866 2490023, 2490024, 2490025, 2490026.మరోవైపు రాష్ట్రంలో నామినేషన్ల సందర్భంగా దాడుల పై ఐజీ రాజకుమారి సమీక్షించారు.ఇందుకు సంబంధించి జిల్లా ఎస్పీల నుంచి ఆమె సమాచారం తెప్పించుకుంటున్నారు.
సీబీఐ చేతికి సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు
విజయవాడ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశించింది. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తన తీర్పును వెలువరించింది.విచారణ సందర్భంగా సాయికృష్ణ కేసును దర్యాప్తు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీంతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా అందించాలని స్పష్టం చేసింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారం గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో.. ఈ కేసులో దర్యాప్తు తీరు, ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం, సీసీటీవీ ఫుటేజ్‌కు సంబంధించిన అంశాలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.
రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్ :కేటీఆర్
----సింగరేణి వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్నల్లగొండ జిల్లా : నర్సంపేట నియోజకవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింగరేణిలో జరిగిన అక్రమాలు, కుంభకోణాలపై తాము నిలదీస్తే రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మీడియా ముందు ఆరోపణలు చేయడం కాదని, దమ్ముంటే సింగరేణి కుంభకోణాలు , ప్రతిపాదిత విదేశీ బొగ్గు కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. కేవలం బొగ్గు అంశమే కాకుండా, సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సింగరేణిలో కొల్లగొట్టిన రూ. 10 వేల కోట్ల కుంభకోణంతో పాటు సోలార్ పవర్ స్కామ్‌పై కూడా సమగ్ర న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో 70 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సింగరేణిని పక్కన పెట్టి, విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడానికి రేవంత్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు. స్థానికంగా టన్ను బొగ్గు రూ. 3,800కి దొరికితే, ఆస్ట్రేలియా తదితర విదేశాల నుంచి కొనుగోలు చేస్తే రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ధర పడుతుందని, అక్కడ వచ్చే కమీషన్ల కోసమే ఈ విదేశీ కొనుగోళ్ల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ హయాంలో సింగరేణి అండతోనే రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమైందని, కానీ నేడు రేవంత్ రెడ్డి ఆ సంస్థను బదనామ్ చేస్తూ సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం రేవంత్ రెడ్డిని ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని హైకమాండ్‌కు ప్రతి నెలా ఈఎంఐ కట్టకుంటే ఆయన పదవి గల్లంతవుతుందని, అందుకే సింగరేణిని అడ్డంపెట్టుకుని స్కామ్‌లు చేసి ముడుపులు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాష్ట్రంలో ఒక రికవరీ ఏజెంట్ లాగా వ్యవహరిస్తూ, రేవంత్ నుంచి కమిషన్లు వసూలు చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఇష్టానుసారంగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల పేరుతో ఛత్తీస్‌గఢ్ ఒప్పందాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తాము గతంలో రూ. 3.90 కే యూనిట్ కొంటే కుంభకోణమన్న కాంగ్రెస్ నేతలు, నేడు రూ. 15 పెట్టి కొనాలని చూస్తున్న తీరును ఏమనాలని ప్రశ్నించారు.రాష్ట్రంలో నెలకొన్న తాగు, సాగునీటి ఎద్దడిపై స్పందిస్తూ.. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని కేటీఆర్ విమర్శించారు. ఆరు నెలల ముందే కాలేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయాలని తాము విజ్ఞప్తి చేసినా, తాను చేసిన తప్పులు బయటపడతాయనే భయంతో రేవంత్ ఆ పని చేయలేదని ఆరోపించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీళ్లు ఎత్తకపోవడంతో వృథాగా పోయాయని, నేడు పంటలు ఎండిపోతుంటే ‘ఎల్-నినో’ పేరుతో చేతులెత్తేస్తున్నారని దుయ్యబట్టారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జలపండగ చేసుకుంటూ 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పం దాకా నీళ్లు తరలించుకుంటుంటే, కేవలం 70 కిలోమీటర్ల దూరంలోని మహబూబ్‌నగర్‌కు కూడా నీళ్లు ఇచ్చుకోలేని చేతకాని స్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
పోలింగ్ కేంద్రలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి టౌన్, అక్టోబర్ 16: రాబోయే ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ఎస్పీ అనకాపల్లి పట్టణంలోని జీవీఎంసీ సంతబయలు వద్ద ఉన్న అతి సమస్యాత్మక (హైపర్ సెన్సిటివ్) పోలింగ్ స్టేషన్ ప్రాథమిక పాఠశాలను, అలాగే రావు గోపాలరావు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పర్యటనలోని ముఖ్య అంశాలు & ఆదేశాలు: డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఏర్పాట్లు (రావు గోపాలరావు కళాక్షేత్రం):భద్రతపై అధికారులతో చర్చించి, అవసరమైన పటిష్ట చర్యలను సమీక్షించారు. వాహనాల పార్కింగ్ స్థలం కేటాయింపు, ఎన్నికల విధులకు వచ్చే సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. సిబ్బంది బస (వసతి), భోజన సదుపాయాలు మరియు ఇతర మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రం (జీవీఎంసీ సంతబయలు ప్రాథమిక పాఠశాల): కేంద్రం వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రతా పర్యవేక్షణ కోసం సమగ్రంగా సీసీటీవీ కెమెరాలు అమర్చడంతో పాటు, వెబ్‌కాస్టింగ్ సదుపాయాన్ని పక్కాగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కాంపౌండ్ వాల్ (రహదారి గోడ) లేని ప్రదేశాలలో వెంటనే రక్షణ గోడ లేదా అవసరమైన రక్షణ కంచెను ఏర్పాటు చేయాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు, అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీ చక్రవర్తి, టౌన్ సీఐ ప్రేమ కుమార్ మరియు ఇతర రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
న్యూ ఢిల్లీ ; ప్రపంచవ్యాప్తంగా పలు ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న వేళ, భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. వీలైనంత త్వరగా ఈ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. బ్యాంకాక్‌లో జరిగిన ఐఎంఎఫ్-ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల వేదికగా ఆమె మాట్లాడారు.ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అగ్రరాజ్యం అమెరికాతో చర్చలు వేగవంతం చేశామని, ప్రస్తుతం ఇవి చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు.భారత్-అమెరికా ఒప్పందానికి సంబంధించి ప్రాథమిక/తొలి దశ ఇప్పటికే ఖరారైందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తనకు వెల్లడించినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి చట్టపరమైన ముసాయిదా రూపకల్పన జరుగుతోందని, త్వరలోనే సంతకాలు కూడా పూర్తవుతాయని చెప్పారు.అంతర్జాతీయంగా కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత స్థిరంగా వృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. కొవిడ్ అనంతర కాలంలో గత నాలుగైదేళ్లుగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని పునరుద్ఘాటించారు.సమ్మిళిత అభివృద్ధి విధానాలు, యువత నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు మరియు పక్కా ఆర్థిక క్రమశిక్షణే భారత్ వృద్ధికి ప్రధాన కారణాలని వివరించారు. ప్రజాధనం వినియోగం పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన బాధ్యత ఉందని తెలిపారు.
ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ?
---నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు!న్యూ ఢిల్లీ ; కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాల సమాచారం. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన మరియు మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుల ఆమోదం కోసం ఈ భేటీని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. గత వర్షాకాల సమావేశాల అనంతరం సభను అధికారికంగా 'సత్రావసానం' చేయకపోవడంతో ఈ ప్రత్యేక భేటీ నిర్వహణకు మార్గం సుగమమైంది.నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులను గతంలోనే ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ, నీట్ పేపర్ లీకేజీ వివాదం మరియు సీజేపీ ఆందోళనల కారణంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి రావడం, విపక్షాల నిరసనలతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది.రాజ్యాంగ సవరణకు పార్లమెంటులో మూడింట రెండు వంతుల ప్రత్యేక మెజారిటీ (సుమారు 360 స్థానాలు) అవసరం. తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఎంపీలు, శివసేన-యూబీటీ నుంచి ఆరుగురు ఎంపీలు అధికార పక్షంలో చేరడంతో కేంద్ర బలం గణనీయంగా పెరిగింది.ఈ కీలక బిల్లులకు మరింత స్పష్టమైన మెజారిటీ సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం డీఎంకే సహా ఇతర ప్రాంతీయ పార్టీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.మరోవైపు సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలు తెలుపుతున్న తరుణంలో, కేంద్రం ఈ ప్రతిష్టాత్మక బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకురావడం తీవ్ర రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
రక్షణ రంగంలో డ్రోగో ఏరోస్పేస్‌కు మరో ఘనత
--జేకే 250ఈ డ్రోన్‌కు డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్--తొలి హైబ్రిడ్ ఫిక్స్డ్-వింగ్, మల్టీ-రోటర్ యూఏవీగా జేకే 250ఈన్యూ ఢిల్లీ , అక్టోబర్ 15:స్వదేశీ మానవరహిత వైమానిక వాహనాల (యూఏవీ) తయారీలో మరో కీలక మైలురాయిని డ్రోగో ఏరోస్పేస్ అధిగమించింది. సంస్థ అభివృద్ధి చేసిన జేకే 250ఈ ఫిక్స్డ్-వింగ్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీఓఎల్) డ్రోన్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) టైప్ సర్టిఫికేషన్ లభించింది. దీంతో సంస్థ సాధించిన డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్ల సంఖ్య ఆరుకు చేరింది.హైబ్రిడ్ ఫిక్స్డ్-వింగ్, మల్టీ-రోటర్ కాన్ఫిగరేషన్‌తో రూపొందిన యూఏవీల్లో శిక్షణ ప్రయోజనాల కోసం డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్ పొందిన దేశంలోనే తొలి డ్రోన్ జేకే 250ఈ అని సంస్థ సి ఈ ఓ యశ్వంత్ బొంతు తెలిపారు . ఈ గుర్తింపు స్వదేశీ డ్రోన్ సాంకేతికతతో పాటు యూఏవీ ఆపరేటర్లకు శిక్షణ అందించే దేశీయ సామర్థ్యాల అభివృద్ధికి దోహదపడనుంది.నిఘా, పర్యవేక్షణ అవసరాలకు అనుగుణంగా :భారత రక్షణ దళాల నిఘా, పర్యవేక్షణ, సమాచార సేకరణ (ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ అండ్ రికనైసెన్స్–ఐఎస్ఆర్) అవసరాలను దృష్టిలో ఉంచుకుని జేకే 250ఈని రూపొందించారు. సంప్రదాయ స్థిర-రెక్కల విమానాల సామర్థ్యాన్ని నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేసే సౌకర్యంతో మిళితం చేయడం దీని ప్రత్యేకత. దీనివల్ల సంప్రదాయ రన్‌వే అవసరం లేకుండానే కార్యకలాపాలు నిర్వహించవచ్చు. రెండు నుంచి మూడు గంటల పాటు గగనతలంలో ఉండగల ఈ డ్రోన్ సుదీర్ఘ నిఘా, పర్యవేక్షణ కార్యకలాపాలకు అనువుగా ఉంటుంది.డ్రోగో ఏరోస్పేస్ ఇప్పటికే జేకే 250ఈ డ్రోన్లను భారత సైన్యానికి అందించింది. రక్షణ రంగ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ యూఏవీ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఇది కీలక ముందడుగుగా నిలిచింది.ఆరు టైప్ సర్టిఫికేషన్లతో :జేకే 250ఈకి లభించిన తాజా గుర్తింపుతో డ్రోగో ఏరోస్పేస్ సాధించిన డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్ల సంఖ్య ఆరుకు చేరింది. స్వదేశీ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, విమాన భద్రతా ప్రమాణాలు, నియంత్రణ నిబంధనల అనుసరణలో సంస్థ సాధిస్తున్న పురోగతికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.డ్రోగో ఏరోస్పేస్ చీఫ్ యశ్వంత్ బొంతు మాట్లాడుతూ, జేకే 250ఈకి లభించిన సర్టిఫికేషన్ రక్షణ, శిక్షణ అవసరాలకు స్వదేశీ యూఏవీ సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో కీలక మైలురాయని తెలిపారు. స్వదేశీ సాంకేతికతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడంతోపాటు భారత రక్షణ, ఏరోస్పేస్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు కృషి కొనసాగిస్తామని పేర్కొన్నారు.
మిల్కీ బ్యూటీ...సిల్క్ స్మిత అవుతుందా ?
వన్ సినిమా : భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత సంచలనం సృష్టించిన బయోగ్రాఫికల్ చిత్రాలలో ది డర్టీ పిక్చర్ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. అగ్ర నటి విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు కొనసాగింపుగా డర్టీ పిక్చర్ 2 చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటన వెలువడిన క్షణం నుంచి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తారనే అంశంపై సినీ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతోంది.ఈ క్రేజీ సీక్వెల్లో మిల్కీ బ్యూటీ తమన్నా నటించే అవకాశం ఉందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గ్లామర్ పాత్రలతో పాటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో రాణిస్తున్న తమన్నాను ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఆమెతో పాటు యానిమల్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి డిమిరి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరిని ఖరారు చేస్తారనే అంశంపై త్వరలోనే అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. మొదటి భాగంలో సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించగా, ఈ రెండో భాగంలో మాత్రం పూర్తిగా కొత్త కథతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. భిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ సీక్వెల్ పై అంచనాలు ఇప్పటికే తారస్థాయికి చేరుకున్నాయి. గత చిత్రానికి మాదిరిగానే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని చిత్ర యూనిట్ గట్టిగా నమ్ముతోంది. నటీనటుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.సినిమాల పరంగా తమన్నా వరుస ప్రాజెక్ట్‌లతో అత్యంత బిజీగా గడుపుతున్నారు. ఆమె నటించే ప్రతీ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండటంతో ఈ చిత్రంలో ఆమె నటిస్తే ప్రాజెక్ట్‌పై హైప్ మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అధికారిక అప్డేట్లు వెలువడనున్నాయి.
ట్రెండింగ్ వార్తలు (Trending)
ప్రభుత్వ ఎక్స్ గ్రేషియో చెక్కును బాధితలకు అందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
2రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
3పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ నిరసనలు హాస్యాస్పదం
4జీవీఎంసీ పరిధిలో అనధికార లేఔట్లను క్షుణ్ణంగా పరిశీలించండి
5బంగాళాఖాతంలో అల్పపీడనం..నెలాఖరున వర్షాలు
Classifieds & Jobs
View Allస్థానిక వాతావరణం (Local Weather)
వాతావరణ వివరాలను సేకరిస్తోంది...
స్థానాన్ని గుర్తించలేకపోయాము.
ప్రత్యేక వీడియోలు
View All