నేరాలు-ఘోరాలు
4 వార్తలు కనుగొనబడ్డాయి
నేరాలు-ఘోరాలు
చర్చల్లో వెనక్కి తగ్గని ఇరాన్ !
ఇరాన్ : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలు, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి)పై నియంత్రణ విషయంలో ఇరుపక్షాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రాంతీయంగా పెద్ద యుద్ధం రాకుండా నిరోధించేందుకు జరుగుతున్న ఈ చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోందని ఇరుదేశాలు సంకేతాలు ఇచ్చాయి. తాజా చర్చల రౌండ్‌లో “కొన్ని మంచి సంకేతాలు” కనిపించాయని అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) మార్కో రూబియో తెలిపారు. అయితే అప్పుడే దీనిపై అతిగా ఆశలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తూ.. రాబోయే కొద్ది రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం అని విలేకరులతో అన్నారు. మరోవైపు, ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని, కానీ గత కొన్ని రోజులుగా ఇరుపక్షాల మధ్య ఉన్న వ్యత్యాసాలు (అభిప్రాయభేదాలు) తగ్గుతూ వస్తున్నాయని ఇరాన్ ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి.అసలు వివాదమంతా ఇరాన్ తన సంపన్న యురేనియం నిల్వలను తన వద్దే ఉంచుకోవాలని పట్టుబట్టడం, అలాగే ప్రపంచ ఇంధన రవాణాకు గుండెకాయ లాంటి ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ జలసంధిలో షిప్పింగ్ నిబంధనలపై తనకే పూర్తి అధికారం ఉండాలని కోరడం వల్లే వస్తోంది. ప్రపంచంలోని ప్రధాన చమురు, గ్యాస్ రవాణా ఈ జలసంధి గుండానే సాగుతుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో చాలా కఠినంగా ఉన్నారు. ఇరాన్ దగ్గర ఉన్న అధిక సంపన్న యురేనియం నిల్వలను అమెరికా ఏదో ఒక రోజు స్వాధీనం చేసుకుంటుందని అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) మార్కో రూబియో స్పష్టం చేశారు. ఈ యురేనియంను ఇరాన్ అణు ఆయుధాల తయారీకి వాడుతుందని అమెరికా నమ్ముతోంది. దానిని ఎలాగైనా సాధించి, ఆ తర్వాత నాశనం చేస్తాం తప్ప, ఇరాన్ దగ్గర మాత్రం ఉండనివ్వబోమని ట్రంప్ వైట్ హౌస్‌లో మీడియాతో వ్యాఖ్యానించారు.అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలపై ఎలాంటి పన్నులు (టోల్స్) గానీ, ఆంక్షలు గానీ విధించడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. అది అంతర్జాతీయ జలమార్గమని, ప్రపంచ షిప్పింగ్ కోసం అది ఎప్పుడూ స్వేచ్ఛగా, తెరిచే ఉండాలని డిమాండ్ చేశారు. కానీ, ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనదని చెప్తోంది. యురేనియం విషయంలో తగ్గేదే లేదన్నట్లుగా ఇరాన్ అధికారులు వ్యవహరిస్తున్నారు. దేశం దాటించి యురేనియంను బయటకు పంపకూడదని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అటు హోర్ముజ్ జలసంధిపై కూడా ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని గట్టిగా వినిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ప్రాంతీయ మిత్రదేశాల మిలిటరీ చర్యల వల్ల అక్కడ భద్రతా వాతావరణం మారిపోయిందని, కాబట్టి తమ సముద్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.మరోవైపు తెరవెనుక జరుగుతున్న దౌత్య చర్చలను వేగవంతం చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ త్వరలోనే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వెళ్లనున్నారు. అయితే ఈ చర్చల ఆలస్యం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహనం నశిస్తోందని, అందువల్ల ఇరాన్-అమెరికా మధ్య సమాచార మార్పిడిని మరింత వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నామని చర్చల్లో పాల్గొంటున్న వర్గాలు తెలిపాయి. ఇరాన్ ఈ వారంలో అమెరికాకు ఒక కొత్త ప్రతిపాదనను పంపింది, కానీ అందులో గతంలో ట్రంప్ తిరస్కరించిన డిమాండ్లే ఉన్నాయి. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ, యుద్ధ నష్టపరిహారం, ఆంక్షల తొలగింపు, ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల విడుదల మరియు ప్రాంతం నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ వంటి పాత డిమాండ్లనే ఇరాన్ మళ్ళీ చేర్చింది. ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే, మళ్లీ ఇరాన్‌పై సైనిక దాడులు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. దానికి ప్రతిగా.. అమెరికా కనుక దాడులు చేస్తే, తమ ప్రతీకారం కేవలం ఈ ప్రాంతానికే పరిమితం కాదని, చాలా తీవ్రంగా ఉంటుందని ఇరాన్ విప్లవాత్మక బలగాలు (రివల్యూషనరీ గార్డ్స్) హెచ్చరించాయి. వారాల తరబడి చర్చలు జరుగుతున్నా, తాత్కాలిక కాల్పుల విరమణ ఉన్నప్పటికీ.. ఇరాన్ మాత్రం అణు ఆయుధ స్థాయికి దగ్గరగా ఉన్న యురేనియం నిల్వలను, క్షిపణులను, డ్రోన్ సామర్థ్యాలను అలాగే ఉంచుకోవడం అమెరికా, దాని మిత్రదేశాలకు పెద్ద తలనొప్పిగా మారింది.
గంజాయి అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా ట్రెయిన్ లో ఆకస్మిక తనిఖీలు
ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, సుమారు 13కిలోల గంజాయి స్వాధీనం- విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,విజయనగరం : జిల్లాలో గంజాయి, మద్యం, ప్రేలుడు సామగ్రి, డ్రగ్స్, గుట్కాలు అక్రమ రవాణ నియంత్రణకు మరియు అనుమానస్పద వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకొనేందుకు ఒడిస్సా బ్రహ్మపుర నుండి విశాఖపట్నం ప్రయాణికులతో రద్దీగా వెళ్లే పాసింజరు ట్రెయిన్ నంబరు /58531 ను లక్ష్యంగా చేసుకొని మే 21న ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి, గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి సుమారు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - జిల్లాలో మద్యం, గంజాయి, మందుగుండు, ప్రేలుడు, డ్రగ్స్, గుట్కాల అక్రమ రవాణ నియంత్రణకు, అనుమానస్పద వ్యక్తులను అదువులోకి తీసుకొనే లక్ష్యంతో ఒడిస్సా బ్రహ్మపుర నుండి విశాఖపట్నం వెళ్ళే పాసింజరు ట్రెయిన్ /58531లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని జిల్లా ఎస్పీ తెలిపారు. చీపురుపల్లి రైల్వే స్టేషను నుండి నెల్లిమర్ల రైల్వే స్టేషను వరకు అధికారులు, సిబ్బంది, డాగ్ స్క్వాడుతో ట్రెయిన్లోని అన్ని కంపార్టుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి, ప్రయాణికుల బ్యాగులు, వస్తువులను బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ నహాయంతో పరిశీలించారు. చీవురుపల్లి రైల్వే స్టేషనులో బ్రహ్మపుర విశాఖపట్నం వెళ్ళే పాసింజరు ట్రెయినును లక్ష్యంగా చేసుకొని పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారన్నారు. తనిఖీల్లో ట్రైన్ లో ప్రయాణించే పాసింజర్స్ కు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి, ఒక్కొక్క కంపార్టుమెంటును పోలీసు అధికారుల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, డాగ్, బాంబ్ స్క్వాడ్స్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీలు చేపట్టే సమయంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రైన్ ను చీపురుపల్లి రైల్వే స్టేషనులో ఎక్కువ సమయం నిలిపివేయకుండా, పోలీసు అధికారులు, సిబ్బంది నెల్లిమర్ల రైల్వే స్టేషనుకు చేరేంత వరకు ట్రైన్లో ప్రయాణించి, ప్రయాణికుల బ్యాగులు, లగేజ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేసామన్నారు. ఈ తనిఖీల్లో ఈగల్, జిఆర్పీ, సివిల్, ఎస్టీఎఫ్, బాంబ్ డిటెక్షన్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ కూడా పాల్గొన్నాయి. ఈ తనిఖీలు చేపట్టే ముందు ట్రైన్లో చేపట్టాల్సిన విధుల గురించి చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు చీపురుపల్లి రైల్వే స్టేషను వద్ద రైడ్స్ లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది, ఎస్టీఎఫ్, బాంబ్, డాగ్ స్క్వాద్ బృందాలకు దిశా నిర్ధేశం చేసారు. ఈ తరహా అకస్మిక తనిఖీలను భవిష్యత్తులో కూడా కొనసాగించి, నేర నియంత్రణకు ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణకు పాల్పదుతున్న ఇద్దరు వ్యక్తులను (1) కేరళ రాష్ట్రం కసర గాడ్ జిల్లా పారిపురం పోస్టు కొడవలుం గ్రామానికి చెందిన కొడవలం దేవినాధ్ (21 సం.లు) (2) కేరళ రాష్ట్రం యర్నాకులం జిల్లా కుట్టంపుజా పోస్టు వట్టటుపర గ్రామానికి చెందిన ఏదోతా పటమాటు జోసెఫ్ (21 సం.లు) అదుపులోకి తీసుకొని, వారివద్ద నుండి సుమారు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన వ్యక్తులను తదుపరి చర్యల నిమిత్తం పలాస జి.ఆర్.పి. పోలీసులకు అప్పగించినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. తోటి ప్రయాణికులు పోలీసుల చర్యలను అభినందించినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ తనిఖీలలో చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, చీపురుపల్లి సిఐ జి.శంకరరావు, ఎస్ఐలు లోకేశ్వరరావు, లోకేష్, నారాయణరావు, మధుసూధనరావు, స్వీటీ, ఆర్పీఎఫ్, ఈగల్, ఎస్టీఎఫ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి.
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్
( న్యూస్ వన్ ప్రత్యేక ప్రతినిధి )అమెరికా అధ్యక్షుడు మరోసారి తన వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చకు తెరలేపారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తన ఘాటు వ్యాఖ్యలు, వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచే ట్రంప్ ఈసారి ఇజ్రాయెల్ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇజ్రాయెల్‌లో తనకు అపారమైన ప్రజాదరణ ఉందని, అవసరమైతే అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసినా గెలవగలనని ట్రంప్ వ్యాఖ్యానించడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రధాని పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. నెతన్యాహు ఎంతో మంచి నాయకుడని, తాను చెప్పిన విషయాలను గౌరవిస్తారని తెలిపారు. "నెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను ఏం చెబితే ఆయన అది చేస్తారు. ఆయన యుద్ధ కాలపు ప్రధానమంత్రి. కానీ ఇజ్రాయెల్‌లో ఆయనకు దక్కాల్సిన గౌరవం పూర్తిగా దక్కడం లేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలపై మరోసారి చర్చకు దారితీశాయి."ఇజ్రాయెల్‌లో నాకు 99 శాతం మద్దతు"అలానే ఇంకా మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ప్రజల్లో తనకు ఉన్న ఆదరణ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నాకు 99 శాతం ప్రజాదరణ ఉంది. నేను అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసినా గెలవగలను" అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, పలువురు రాజకీయ విశ్లేషకులు వీటిని ట్రంప్ ప్రత్యేక రాజకీయ శైలిగా అభివర్ణిస్తున్నారు.ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఒక విదేశీ దేశ రాజకీయాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు ఈ స్థాయిలో వ్యాఖ్యానించడం అరుదైన విషయమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యప్రాచ్య రాజకీయాల్లో అమెరికా పాత్ర, ఇజ్రాయెల్‌కు ట్రంప్ గతంలో ఇచ్చిన మద్దతు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.ఇరాన్‌కు మరో హెచ్చరిక ;ఇదే సమావేశంలో Iranతో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా ట్రంప్ స్పందించారు. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకునే విషయంలో తనకు ఎలాంటి తొందర లేదని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాల్సిన అవసరం ఉందని, ప్రపంచ చమురు సరఫరాకు అది అత్యంత కీలకమని పేర్కొన్నారు. అదేవిధంగా, "ఇరాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది" అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.అమెరికాలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ రాజకీయాల్లో తన ప్రభావం ఇంకా కొనసాగుతోందని చూపించాలనే ప్రయత్నంగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్‌కు ట్రంప్ గతంలో బలమైన మద్దతు ఇచ్చారు. జెరూసలేం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడం, అమెరికా రాయబార కార్యాలయాన్ని అక్కడికి మార్చడం వంటి నిర్ణయాలతో ఆయన ఇజ్రాయెల్‌లోని కుడిపక్ష వర్గాల్లో మంచి గుర్తింపు సంపాదించారు.ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి. ఆయన వ్యాఖ్యలు సరదాగా చేసినవా, లేక రాజకీయ సంకేతాలా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. ట్రంప్ ఎక్కడ మాట్లాడినా, ఏ వ్యాఖ్య చేసినా ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకోవడంలో మాత్రం ఎప్పటిలాగే విజయవంతమవుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి
ఎయిరిండియాకు తప్పిన ప్రమాదం
బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు, సిబ్బందిబెంగళూరు : ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తున్న ఎయిరిండియాకు పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్‌కు గురైంది. అనంతరం విమానాన్ని తక్షణమే గ్రౌండ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఎయిరిండియా AI2651 విమానం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చింది. విమానం బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో ‘టెయిల్ స్ట్రైక్’కు చోటుచేసుకున్నట్లు ఎయిరిండియా సంస్థ తెలిపింది. అంటే విమానం వెనుక భాగం రన్‌వేపై తగిలినట్లు అర్థం. ఈ ఘటన తర్వాత విమానాన్ని పూర్తి స్థాయి సాంకేతిక తనిఖీల కోసం సేవల నుంచి తప్పించారు. విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అందరినీ సురక్షితంగా విమానం నుంచి దించేశారు. ఇక బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. బెంగళూరులోని గ్రౌండ్ సిబ్బంది అవసరమైన సహాయం అందిస్తున్నారని తెలిపింది.ఈ ఘటనపై ఎయిరిండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా మొదటి ప్రాధాన్యత’’ అని పేర్కొన్నారు. అలాగే నియమావళి ప్రకారం సంబంధిత నియంత్రణ సంస్థలతో కలిసి ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.టెయిల్-స్ట్రైక్ అంటే ఏమిటి?ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో విమానం తోక భాగం రన్‌వేను తాకడాన్ని టెయిల్-స్ట్రైక్ అంటారు. సాధారణంగా ల్యాండింగ్ సమయంలో విమానం మరీ ఎక్కువగా పైకి వంగినప్పుడు లేదా సమతుల్యత కోల్పోయినప్పుడు ఇది జరుగుతుంది. ఈ సంఘటన విమానానికి నష్టం కలిగించగలదు. ప్రమాదకరమైనది కూడా. అందువల్ల ఇటువంటి సందర్భాల్లో విమానానికి క్షుణ్ణమైన సాంకేతిక తనిఖీ అవసరం అని తెలుస్తుంది.