నమస్తే

స్వాగతం

NewsOne కి స్వాగతం

Sign In / Register
హోమ్ రాజకీయం సినిమా వ్యాపారం వార్తలు దేవాలయాలు లీగల్ వార్తలు ఆరోగ్యం క్రీడలు నేరాలు-ఘోరాలు

వార్తలు

41 వార్తలు కనుగొనబడ్డాయి

వార్తలు

చెముడులంకలో ఉచిత మెగా వైద్య శిబిరం

ఆలమూరు :  డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభమైంది.గ్రామ మాజీ సర్పంచ్  నాగిరెడ్డి వెంకట రత్నం*ఆహ్వానం మేరకు, ఉమెన్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఛైర్మన్ బూసి విద్యా ప్రసన్న ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ కృష్ణదేవరాయ కాపు కళ్యాణమండపం, చెముడు లంక రాజమండ్రికి చెందిన ప్రముఖ ఆసుపత్రులు శ్రీకర మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్, గౌతమి నేత్రాలయం, రమా దంత వైద్యశాల కు చెందిన నిపుణులైన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని బీపీ, షుగర్, ఈసీజీ, గుండె, ఎముకలు-కీళ్లకు సంబంధించిన పరీక్షలు, కంటి, దంత పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.మహిళలకు లేడీ డాక్టర్లచే ప్రత్యేక పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ, ఉచిత కంటి ఆపరేషన్లు, 50% రాయితీపై కళ్లజోళ్లు అందజేశారు. గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

GANTA MADHU· 4 రోజుల క్రితం
వార్తలు

నవంబర్ 15 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి

---బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం---కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులదే--- ఎన్నికలతో పాటు అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలి ---సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 15వ తేదీ నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యత పూర్తిగా ఇన్‌ఛార్జ్ మంత్రులపైనే ఉంటుందని తేల్చి చెప్పారు.కూటమిలోని భాగస్వామ్య పార్టీల నాయకులందరూ సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యేలకు నిధుల విడుదలపైనా సీఎం కీలక ప్రకటన చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. నవంబర్ 15వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.స్థానిక సంస్థల్లో కూటమి బలాన్ని మరింత పెంచుకునేలా నాయకులు కృషి చేయాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం కీలకమని స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులపైనే ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను అంచనా వేస్తూ, అభ్యర్థుల విజయానికి అవసరమైన వ్యూహాలను రూపొందించాలని సూచించారు.కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలు పరస్పర విభేదాలకు తావివ్వకుండా కలిసి పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. నాయకుల మధ్య సమన్వయం లోపిస్తే ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించినట్లు తెలుస్తోంది.స్థానిక స్థాయిలో ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడం వంటి అంశాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను సోమ, మంగళవారాల్లో విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.ఈ నిధుల ద్వారా స్థానికంగా అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారం వంటి పనులకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. నిధుల విడుదలతో ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు గడువును నిర్దేశిస్తూ, మరోవైపు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని ప్రకటించడం ద్వారా ప్రభుత్వం పరిపాలన, రాజకీయ సమన్వయంపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు సమష్టిగా పనిచేయాలని సీఎం సూచించారు.సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు  :  స్థానిక సంస్థల్లో బీసీలకు సుమారు 28 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, మిగిలిన 6 శాతం వరకు కూటమి పార్టీలు తమ పార్టీ పరంగా కేటాయించాలని నిర్ణయించింది.. గ్రామీణ స్థానిక సంస్థల్లో భాగంగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి మొత్తం 1,33,910 సీట్లలో 30,315 స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు.. రాష్ట్రంలోని 13,351 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు సంబంధించి 3,128 స్థానాలను బీసీలకు కేటాయించనున్నారు.ఇక, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) విషయానికి వస్తే, మొత్తం 9,913 స్థానాల్లో 2,400 స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు. మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) పదవులకు సంబంధించి మొత్తం 661 స్థానాల్లో 152 స్థానాలు బీసీలకు దక్కనున్నాయి. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జడ్పీటీసీ) విషయంలోనూ మొత్తం 661 స్థానాల్లో 152 స్థానాలను బీసీలకు కేటాయించనున్నట్లు వివరాల్లో పేర్కొన్నారు. మరోవైపు.. జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 స్థానాల్లో ఏడు స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు. దీంతో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా పరిషత్ స్థాయి వరకు బీసీలకు ప్రాతినిధ్యం కల్పించేలా రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.పట్టణ స్థానిక సంస్థల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కేటాయించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మొత్తం 3,884 వార్డు స్థానాలకు గాను 1,273 స్థానాలను బీసీలకు రిజర్వు చేయనున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులకు సంబంధించి మొత్తం 106 స్థానాల్లో 35 స్థానాలను బీసీలకు కేటాయించనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవుల విషయంలో మొత్తం 17 స్థానాల్లో ఆరు స్థానాలను బీసీలకు రిజర్వు చేయాలని నిర్ణయించినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇది 35.29 శాతానికి సమానమని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించి, బీసీ కుల సంఘాలు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగా కేబినెట్ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు, తుది జాబితా వెలువడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై తదుపరి స్పష్టత రానుంది.

STATE BEURO · 4 రోజుల క్రితం · Andhra Pradesh, Guntur
వార్తలు

అభిజీత్ దీప్కేకు తీరని విషాదం.. నానమ్మ మృతి!

హింగోలి : మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో అనారోగ్యం, వయోభారంతో అభిజీత్ దీప్కే నానమ్మ కన్నుమూశారు.మరోవైపు, ఢిల్లీలో CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. నానమ్మ అంత్యక్రియల కోసం కుటుంబాన్ని కలుసుకునేందుకు ఆయనకు అనుమతి లభిస్తుందా?

RITA · 4 రోజుల క్రితం
వార్తలు

దబ్బంద టిడ్కో కాలనీ సందర్శించిన గంటా

ఆనందపురం, మే 20: ఆనందపురం మండలం దబ్బంద గ్రామంలో నిర్మించిన టిడ్కో గృహాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం సందర్శించారు. కాలనీ ప్రజల సమస్యలను ఆయన అడిగి తీసుకున్నారు. టిడ్కో కాలనీలో 1,920 యూనిట్లు ఉండగా.. సరైన సౌకర్యాలు లేకపోవడంతో కేవలం 10- 15 శాతం మంది నివాసముంటున్నారని వారు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద సబ్సిడీ ధరకు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను కేటాయించారు. బ్యాంకులకు ఈ.ఎం.ఐ.లు కట్టలేక, కనీస వసతులు లేని దబ్బంద టిడ్కో ఇళ్లల్లో ఉండలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. బ్యాంకు నుంచి తీసుకున్న  రుణాలు రద్దు చేయాలని కోరారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పార్కు, ఆరోగ్య కేంద్రం, రేషన్ డిపో, ప్రజా రవాణా వంటి ప్రాథమిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి వేళ్లలో వీధి దీపాలు వెలగకపోవడం వల్ల మహిళలకు రక్షణ కరువవుతోందని, చెత్తా చెదారం పేరుకుపోవడంతో విష సర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయన్నారు. అలాగే స్మశాన వాటిక నిర్మించాలని విన్నవించారు. త్వరలో జరిగే జీవీఎంసీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సమావేశంలో టిడ్కో కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన గురించి చర్చించి, పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని గంటా హామీ ఇచ్చారు. అంతకుముందు కాలనీలో టీడీపీ జెండాను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనుబాబు, డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ, టిడ్కో ఎస్.ఈ. రామిరెడ్డి, ఈఈ సుధాకర్, డీఈ రాజేష్, ఏఈ అనూష, సి.ఎల్.టి.సి. దేముడు బాబు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, గండ్రెడ్డి సోమినాయుడు, లొడగల వెంకట్రావు, బలిరెడ్డి మల్లికార్జునరావు, మదపాటి శ్రీను, గండ్రెడ్డి రమేష్, కాళ్ల నగేష్ కుమార్, అప్పలరాము, ఎర్ర రాజు, బోని ప్రసాద్, శివ, శ్రీను, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

VENKATA RAO · 5 నెలల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
వార్తలు

ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ ఉద్యోగుల తో నిర్వహించాలి

మద్దిలపాలెం : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారం కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం వాల్తేరు డిపో వద్ద గేట్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజనల్ అధ్యక్షులు ఎ కె శివాజీ ముఖ్య అతిథిగా విచ్చేసారు.గేట్ మీటింగ్ ను ఉద్దేశించి శివాజీ మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రభుత్వం ద్వారా కనుగోలు చేయాలని ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని స్త్రీ శక్తి బస్సులలో జీరో టికెట్ ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేసి మగవారికి మాత్రమే టికెట్ ఇచ్చే విధానం ద్వారా మహిళలు ఉచితంగా ఎటువంటి టికెట్ తీసుకోకుండా ప్రయాణించేలా చేయాలని ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని కొత్త టిమ్ లు ఏర్పాటుచేయాలని పి ఆర్ సి కమిటీని నియమించి ఐఆర్ ను వెంటనే ప్రకటించాలని పెండింగ్లో ఉన్న డి ఎ ఆరియర్స్ మరియు లీవ్ ఎన్ క్యాష్ మెంట్ ఇవ్వాలని గౌరవ ఎండి గారికి ఇచ్చిన మెమోరాండంలోని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని అలాగే ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులను వెంటనే కొనుగోలు చేయాలని అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేయాలని రిటైర్ అయిన చనిపోయిన సిబ్బందికి వెంటనే సెటిల్మెంట్స్ చేయాలని ఆర్టీసీ ఉద్యోగులకు ఇ ఎచ్ ఎస్ నుండి మినహాయించి గతంలో ఆర్టీసీ నందు ఉన్న వైద్య సదుపాయం అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రిని రాష్ట్ర కమిటీ కోరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఉద్యోగులను ముందుగా వాల్తేరు డిపో అధ్యక్షులు ఆర్ వసంతరావు చైతన్యపరిచారు ఈ గేటు మీటింగ్ లో రాష్ట్ర కార్యదర్శి పిజిపతి కార్యదర్శి ఎస్ యం నాయుడు డి ఎస్ ఆర్ రాజు గ్యారేజీ అధ్యక్షకార్యదర్శులు గ్యారేజ్ ఉద్యోగులు. సి సి ఎస్ డెలిగేట్ కె టి రావు అత్యధిక సంఖ్యలో యూనియన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉద్యోగులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు,

PRASAD · 5 నెలల క్రితం · Andhra Pradesh
ప్రకటన (Advertisement)
వార్తలు

రైతాంగ సమస్యలు పరిష్కారానికై రైతు సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయండి

మునగపాక :రైతు సంఘం తొమ్మిదవ జిల్లా మహాసభ మే 23 న మునగపాక రాధాకృష్ణ ఏసీ కళ్యాణ మండపంలో శనివారం ఉదయం 10 గంటలకు మహాసభ ప్రారంభమవుతాయని సిఐటియు మండల కన్వీనర్ కూండ్రపు సోము నాయుడు ఈ మహాసభలో రైతు సమస్యలపై రైతుల పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ఎరువులు ధరలు తగ్గించాలని అవసరమైన ఎరువులు విత్తనాలు సరఫరా చేయాలని కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ 20000 రూపాయలు ఇవ్వాలని భూనిర్వాస్తులు 2013 చట్ట ప్రకారం న్యాయం చేయాలని తదితర సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తారు కావున ఈ సభలో అచ్యుతాపురం లో ఉన్న రైతులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తోట వెంకటేష్ మైలపల్లి రమణ నడుపూరు సోంబాబు కొల్లి రాము కూండ్రపు సన్యాసిరావు కూండ్రపు సన్నిబాబు కూండ్రపు అప్పారావు తట్ట అప్పారావు లాలం రాము ధర్మ రెడ్డి సత్యనారాయణ పిల్లా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

JAGAN · 5 నెలల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
వార్తలు

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి : ఆర్థిక ఇబ్బందులున్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం రెండో ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని విడుదల చేసిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ అన్నారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనంగా అభివర్ణించారు. గత ప్రభుత్వం రూ.10 వేలు మాత్రమే ఇవ్వగా, కూటమి ప్రభుత్వం రెట్టింపు చేసి రూ.20వేలు ఇస్తోందన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం రూ.262 కోట్లు వ్యయం చేస్తోందని... 1.30 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి జరుగుతోందని తెలిపారు. తాను ప్రాతినిథ్యం వహస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మంది లబ్ధిదారులకు రూ.13.79 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు.  మత్స్యకారుల వలసలను తగ్గించి, తీరప్రాంతాల్లో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీరం పరిధిలో ఉన్న 23 ల్యాండింగ్ సెంటర్లు, 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఆసరాగా నిలుస్తున్నాయని తెలిపారు.

CHANDU · 5 నెలల క్రితం · Andhra Pradesh, Tirupati
వార్తలు

\రేపటినుండి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు

ఎచ్చర్ల ( న్యూస్ వన్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతాయని ఆర్.ఐ ఓ కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ 51 కేంద్రాలలో 23,527 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నార అని అన్నారు .వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 14181 మంది ద్వితీయ సంవత్సరం 9346 మంది పరీక్షలు హాజరు అవుతారని అన్నారు. అధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీగా పరీక్షలు నిర్వహణకు ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్ష లకు,హాజరయ్యే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

RAMA RAO · 5 నెలల క్రితం · Andhra Pradesh, Vizianagaram
వార్తలు

దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతాం

నూరుశాతం ఎన్ రోల్ మెంట్ పై అధికారులు దృష్టిసారించాలిప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంత బిడ్డల్లా భావించి పనిచేయాలిప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్డీఈవోలు, ఏపీసీలతో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ సమావేశంఅమరావతి: దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ఉండాలన్నది నా ధ్యేయం, అందుకు అనుగుణంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నా. అంతర్జాతీయస్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులపై అధ్యయనానికి ఉపాధ్యాయులను విదేశాలకు పంపుతున్నాం. అక్కడ వారు తెలుసుకున్న మంచి బోధనాపద్ధతులను రాష్ట్రంలో అమలు చేస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో రాష్ట్రవ్యాప్తంగా డీఈవోలు, ఏపీసీలతో(అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్) మంత్రి సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... క్వాలిటీ మెరుగుపర్చకపోతే నష్టపోయేది పిల్లలు. ప్రభుత్వ విద్యావ్యవస్థ ఓపెన్ మార్కెట్ తో పోటీపడాలి. ఇందుకోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటుచేశాం. వరల్డ్ క్లాస్ బెస్ట్ మోడల్ ఆఫ్ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ నా లక్ష్యం, ఇందుకోసం అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు.బిడ్డల భవిష్యత్తు కేంద్రంగా నిర్ణయాలుఈ సమావేశం కేవలం సమీక్ష కోసం కాదు, యాక్షన్ ప్లాన్ కోసం ఏర్పాటుచేశాం. నేను విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ పాఠశాలలో ఎంతమంది చదువుతున్నారో రాష్ట్రస్థాయి విజిబిలిటీ, కనీస డేటా అందుబాటులో లేదు. పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేసినప్పుడే నేను కేవలం మూడునెలల్లో పూర్తిస్థాయి సమాచారంతో డ్యాష్ బోర్డు తయారుచేశాం. విద్యాశాఖలో కనీస డేటా బేస్ అందుబాటులో లేని పరిస్థితి నుంచి విద్యాశాఖలో నా ప్రయాణం ప్రారంభించాను. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు మన సొంత బిడ్డల్లా భావించి నిర్ణయాలు తీసుకోవాలి. మనం తీసుకునే నిర్ణయాలపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బిడ్డల భవిష్యత్ కేంద్రంగా నిర్ణయాలు ఉండాలి. డ్యాష్ బోర్డు ప్రకారం యాక్షన్ ప్లాన్ దిశగా డీఈవోలు, ఏపీసీలు పనిచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది పిల్లలు డ్రాపవుట్స్ గా ఉన్నారు. నెవర్ ఎన్ రోల్డ్ పై కూడా ఫోకస్ చేయాలి. నూరుశాతం ఎన్ రోల్ మెంట్ పై అధికారులంతా దృష్టిపెట్టాలి. యువగళం పాదయాత్ర సమయంలో నేను కర్నూలు జిల్లాలో పర్యటించేటప్పుడు వలస కార్మికుల కష్టాలను కళ్లారా చూశాను. ఎట్టిపరిస్థితుల్లో పిల్లలు పొలం పనులకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. ఈ విషయంలో ప్రాపర్ ట్రాక్ మెకానిజం ఉండాలి.ఉద్యమంలా జీఎఫ్ఎల్ఎన్ చేపట్టాలిలెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ ను ఒక ఉద్యమంగా అమలుచేయాలి. వాస్తవాలు తెలుసుకున్నపుడే సరైన నిర్ణయాలు తీసుకోగలం. నిజం చేదుగా,  అబద్ధంగా తీయగా ఉంటుంది. వాస్తవాన్ని అంగీకరిస్తేనే మన ప్రయాణం సరైన దిశగా సాగుతుంది. మేం సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే మీరు సరైన సమాచారం ఇవ్వాలి. ప్రస్తుతం 9వ తరగతికి క్లిక్కర్ టెక్నాలజీ అమలు చేస్తున్నాం, క్రోమ్ బుక్స్ అందించబోతున్నాం. నూరుశాతం జీఎఫ్ఎల్ఎన్ సాధనే లక్ష్యంగా పనిచేయాలి. 5శాతం వెనుకబడటం అంటే సాధారణమైంది కాదు. వాస్తవంలో అది లక్షల సంఖ్యలో ఉంటుంది. వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 10శాతం ఎన్ రోల్ మెంట్ ఇంప్రూవ్ చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందుకోసం సమిష్టిగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం నింపిన విద్యాశాఖ ప్రకటనప్రభుత్వ స్కూళ్లలో క్వాలిఫైడ్, ప్రతిభావంతమైన టీచర్లు ఉన్నారు. పదోతరగతి ఫలితాలపై ఇటీవల తొలిసారి ప్రభుత్వమే యాడ్ ఇచ్చింది. అది పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపింది. అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది మెరుగైన ఫలితాల సాధనకు వందరోజుల ప్రణాళిక బాగా ఉపకరించింది. అది అవసరం లేకుండానే ట్రాన్సిషన్ జరిగాలి, ఫౌండేషన్ పకడ్బందీగా ఉండాలి. దానిపై అధికారులంతా శ్రద్ధ వహించాలి. రెండేళ్లలో రాష్ట్రమంతటా స్మార్ట్ కిచెన్లురాష్ట్రస్థాయిలో ప్రభుత్వ స్కూళ్ల మౌలిక  సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ ప్రవేశపెట్టాం. దీనిపై అధికారులు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. క్రిటికల్ ఇన్ ఫ్రా కోసం ప్రభుత్వం నుంచి నిధులిస్తున్నాం. ఇందుకోసం అవసరమైతే దాతల సహకారం తీసుకోండి. ప్రతి పాఠశాలకు లీక్ ప్రూఫ్ బిల్డింగ్, పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్, టాయ్ లెట్, బెంచిలు కచ్చితంగా ఉండాలి. బేసిక్ ఇన్ ఫ్రా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాలన్నదే మా ధ్యేయం. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కడపలో స్మార్ట్ కిచెన్ అద్భుతంగా చేశారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రం మొత్తం స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ఏర్పాటుచేస్తాం.ఇంటర్నేషనల్ స్కూలుగా నిడమర్రు పాఠశాలమంగళగిరి నియోజకవర్గం నిడమర్రు స్కూలును ఇంటర్నేషనల్ స్కూలుగా తీర్చిదిద్దుతున్నాం. అక్కడ తొలిసారి నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. నెల్లూరులో కూడా రెండు స్కూల్స్ ను మంత్రి నారాయణ అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒక పాఠశాలను మోడల్ స్కూలుగా తీర్చిదిద్దాలని అధికారులను కోరుతున్నా. అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్ అనే కాన్సెప్ట్ అమలులో ఉంది. నిడమర్రులో మేం కల్పించిన అత్యుత్తమ సౌకర్యాల వల్ల పక్క నియోజకవర్గాల వారు మా నియోజకవర్గానికి తమ బిడ్డల అడ్మిషన్ కోసం నివాసం మార్చుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇదే పరిస్థితి కల్పించే లక్ష్యంతో పనిచేయాలి. దీనిపై అధికారులు దృష్టిసారించాల్సిందిగా విజ్జప్తి చేస్తున్నా.బోధనపైనే ఉపాధ్యాయులు దృష్టిపెట్టాలినేను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక అనేక సంస్కరణలు తెచ్చా. ఉపాధ్యాయులు బోధనపైనే దృష్టిపెట్టాలి. అధికారులు అడ్మినిస్ట్రేషన్ పై శ్రద్ద వహించాలి. లీప్ యాప్ ద్వారా పనివిధానాన్ని మెరుగుపర్చుకోవాలి. గతంలో విజిబిలిటీ లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం విధానానికి లీప్ యాప్ కేంద్రంగా ఉంటుంది. రాష్ట్ర, జిల్లా,  మండల, స్కూలు స్థాయిలో ఒకేవిధమైన డేటా ఉండాలి. లక్ష్యసారూప్యత ఉండాలి. డ్యాష్ బోర్డుపై శ్రద్ధపెట్టాలి. ఇదంతా పూర్తయ్యాక పబ్లిక్ డ్యాష్ బోర్డుకు యాక్సెస్ ఇస్తాం. పాల్, ఏఐ బేస్ లెర్నింగ్, ఏఐ ట్యూటర్ త్వరలోనే అమలు చేయబోతున్నాం.నైతిక విలువలు ముఖ్యంటెక్నాలజీతోపాటు నైతిక విలువలు చాలా అవసరం. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారికి కేబినెట్ హోదాతో అడ్వయిజర్ గా పెట్టాం. ప్రతి శనివారం వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పై దృష్టిపెట్టాలి. ఒక సోషల్ మీడియా పోస్టులో కొడుకు తల్లిని చంపే పరిస్థితి చూశాను. నైతిక విలువల బోధనతో ఇటువంటి ఘటనలను నివారించే అవకాశముంది. విద్యాశాఖపై పవిత్రమైన బాధ్యత ఉంది. జెండర్ సెన్సిటివిటీ కూడా చాలా ముఖ్యం. ఉపాధ్యాయులకు ఎక్స్ పోజర్ విజిట్స్ ఏర్పాటు చేస్తున్నాం, యోగా, స్పోర్ట్స్ పై శ్రద్ధ పెడుతున్నాం. స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నాం. శాప్ ద్వారా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెడుతున్నాం. విద్యాశాఖ వద్దని చాలామంది నన్ను వారించినా సమాజంలో నేను ఆశించిన మార్పు విద్యతోనే సాధ్యమని నమ్మి ఈ శాఖను తీసుకున్నాను. నూరుశాతం ఫలితాలు సాధించినపుడే నేను విద్యాశాఖ మంత్రిగా సంతృప్తి చెందుతా. అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మెరుగైన ఫలితాలు సాధించాల్సిన పవిత్ర బాధ్యత మనందరిపై ఉందని మంత్రి లోకేష్ చెప్పారు.రెండేళ్లలో విద్యావ్యవస్థలో అనూహ్య మార్పులుహెచ్ఆర్ డీ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ... పాఠశాల విద్య భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ సమావేశం ఏర్పాటుచేశాం. గత రెండేళ్లలో పాఠశాల విద్యావ్యవస్థలో మునుపెన్నడూ చూడని సంస్కరణలు చూశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అనేకసార్లు మంత్రి లోకేష్ గారు రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్షించి దశ,దిశ నిర్దేశించారు. ఒక్కోసారి ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు నిర్వహించారు. వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు నిరంతరం చర్చలు జరిపారు. రెండేళ్లలో విద్యాశాఖలో గుణాత్మకమైన మార్పులు తెచ్చిన మంత్రిగారికి ధన్యవాదాలు. కఠినమైనప్పటికీ వాస్తవాన్నే చెబుదాం, మంత్రి గారు ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పటివరకు ముందుకుసాగాం. కొంతవరకు సఫలీకృతమయ్యాం. ఇప్పుడు మనం సంస్కరణల దశ నుంచి కన్సాలిడేషన్ వైపు వెళ్తున్నాం. ఈ స్థితిలో ఎదుగుతున్న మొక్కను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నిర్దేశిత లక్ష్యాలను చేరుకునే వరకు నిర్విరామంగా కృషిచేయాలి. లక్ష్యాలపై క్లియర్ డెడ్ లైన్ పెట్టుకొని జవాబుదారీతనంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి తమీమ్ అన్సారియా, ఇతర రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు

KIRAN BABU · 5 నెలల క్రితం · Andhra Pradesh, Guntur
వార్తలు

బాల్య వివాహాలు.. బాలికల మానసిక వికాసానికి అవరోధాలు

--కాగితాలపై సంతకాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి--వప్పంగి గ్రామంలో 'నల్సా ఆశా' 100 రోజుల కార్యాచరణ సదస్సుశ్రీకాకుళం, మే 20:చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికలు మానసిక వేదనకు గురికావడమే కాకుండా, వారి శారీరక ఎదుగుదల దెబ్బతింటుందని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి కె. హరిబాబు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక వప్పంగి గ్రామంలో 'నల్సా ఆశా-2025', 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బాల్య వివాహాల నివారణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల అటు తల్లికి, ఇటు పుట్టబోయే బిడ్డకు ప్రాణసంకటంగా మారుతుందని హెచ్చరించారు. ఇదే సమయంలో గ్రామీణ మహిళలు, ప్రజలు ఎదుర్కొంటున్న పలు చట్టపరమైన అంశాలపై హరిబాబు దిశానిర్దేశం చేశారు. వివాహ సమయంలో వరకట్న వేధింపుల నుంచి రక్షణకు, ఆస్తిలో హక్కులు పొందేందుకు తగిన పత్రాల ద్వారా చట్టపరమైన రక్షణ పొందవచ్చని వివరించారు. అక్షరాస్యత లేని అమాయక ప్రజల వద్ద ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకుని దళారులు, వడ్డీ వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి అంగీకార పత్రాలపై అయినా సంతకాలు చేసేటప్పుడు నమ్మకమైన వ్యక్తులతో పూర్తిగా చదివించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.గ్రామాల్లో ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాల్సి వస్తే జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని, లేదా 15100 టోల్ ఫ్రీ నంబర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు జి. శ్రీనివాసరావు, ఎ.జె. ఆదిల్ షా, న్యాయవాది జి. ఇందిరా ప్రసాద్, సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

RAMA RAO · 5 నెలల క్రితం · Andhra Pradesh, Vizianagaram
ప్రకటన (Advertisement)
హోమ్
లైవ్ TV
ఈ-పేపర్
Loading Live...
లైవ్ TV (Live)