నమస్తే

స్వాగతం

NewsOne కి స్వాగతం

Sign In / Register
హోమ్ రాజకీయం సినిమా వ్యాపారం వార్తలు దేవాలయాలు లీగల్ వార్తలు ఆరోగ్యం క్రీడలు నేరాలు-ఘోరాలు

లీగల్ వార్తలు

18 వార్తలు కనుగొనబడ్డాయి

లీగల్ వార్తలు

ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు

---పోలింగ్‌ బూత్‌లు పరిశీలించిన సిఐ వెంకటేశ్వరరావు కడియం ; రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కడియం మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న పోలింగ్‌ బూత్‌లను సీఐ ఏ. వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ నాగదుర్గాప్రసాద్, ఏ.ఎస్ ఐ. వెంకటరమణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పోలింగ్‌ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, భద్రతాపరమైన అంశాలను పరిశీలించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా అని ఆరా తీశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకునే దిశగా పరిశీలన చేపట్టారు. గుర్తించిన లోటుపాట్లపై నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

GANTA MADHU· 4 రోజుల క్రితం
లీగల్ వార్తలు

ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు

-----పోలింగ్‌ బూత్‌లు పరిశీలించిన సిఐ వెంకటేశ్వరరావు కడియం :  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కడియం మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న పోలింగ్‌ బూత్‌లను సీఐ ఏ. వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ నాగదుర్గాప్రసాద్, ఏ.ఎస్ ఐ. వెంకటరమణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పోలింగ్‌ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, భద్రతాపరమైన అంశాలను పరిశీలించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా అని ఆరా తీశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకునే దిశగా పరిశీలన చేపట్టారు. గుర్తించిన లోటుపాట్లపై నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

GANTA MADHU · 4 రోజుల క్రితం
లీగల్ వార్తలు

కేబినెట్ కు జనసేన డుమ్మా...!

(న్యూస్ వన్ బ్యూరో )ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం ఈ భేటీలో ప్రధాన చర్చనీయాంశంగా ఉన్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చించి, ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే వ్యక్తిగత కారణాలతో జనసేన పార్టీకి చెందిన మంత్రులు కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదని పార్టీ వర్గలు చెబుతున్నాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఈ భేటీకి గైర్హాజరయ్యారు.రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికపై ఉత్కంఠస్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సమకాలీన సమాచారం, సామాజిక పరిస్థితులు, సంబంధిత జనాభా వివరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 19న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ మార్చి 23 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించిన కమిషన్ వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు, అభిప్రాయాలను సేకరించింది. దాదాపు ఏడు నెలలపాటు వివిధ స్థాయిల్లో అధ్యయనం నిర్వహించిన అనంతరం ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.. నివేదికలోని సిఫారసులు, వాటి ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వివరాల పరిశీలనబీసీ జనాభాకు సంబంధించి 1931 తర్వాత ప్రామాణికమైన కులాలవారీ జనాభా లెక్కలు అందుబాటులో లేని నేపథ్యంలో, ప్రభుత్వం నిర్వహించిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (UFS) వివరాలను కమిషన్ పరిశీలించింది.. అలాగే ఎస్సీ, ఎస్టీ జనాభాకు సంబంధించిన వివరాలు 2011 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయని పేర్కొన్నారు. సర్వే ద్వారా సేకరించిన వివరాలతో పాటు SGSW శాఖ వద్ద ఉన్న కులం, జనాభా వివరాలున్న కుటుంబ డేటాబేస్‌ను కూడా పరిశీలించినట్లు సమాచారం. గ్రామ, వార్డు స్థాయిలో ప్రజల ముందుకు వివరాలను తీసుకెళ్లి, తప్పులు లేదా లోపాలు ఉంటే వాటిని పరిశీలించి సరిదిద్దుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.రాష్ట్రంలో బీసీ జనాభా 50.42 శాతం!కమిషన్ గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా 5,27,46,589గా ఉండగా, అందులో బీసీ జనాభా 2,65,94,418గా ఉన్నట్లు సమాచారం. అంటే రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 50.42 శాతంగా అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీ జనాభా 48.84 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 54.36 శాతంగా ఉన్నట్లు కమిషన్ గణాంకాల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.. ఈ గణాంకాలు బీసీ రిజర్వేషన్లపై చర్చలో ముఖ్యమైన అంశంగా మారాయి. అయితే, జనాభా శాతం ఒక్కటే స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్లను నిర్ణయించడానికి సరిపోదని, సంబంధిత చట్టపరమైన మార్గదర్శకాలు, ఇతర సామాజిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కీలక నిర్ణయంస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్టోబర్ 1న వెలువరించిన తీర్పులో కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల మొత్తం 50 శాతం పరిమితిని మించడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ప్రారంభించాలని కూడా ఆదేశించింది. దీనిపై ఏపీ సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.. ఈ నేపథ్యంలో మిశ్రా కమిషన్ నివేదిక, అందులోని సిఫారసులు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను ఎలా ఖరారు చేయాలన్న అంశాలపై కేబినెట్ చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.

KIRAN BABU · 4 రోజుల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
లీగల్ వార్తలు

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

జూన్‌ 1న నోటిఫికేషన్‌..ఏపీలో  నాలుగు స్థానాలుజూన్‌ 18న రాజ్యసభ ఎన్నికలు, అదే రోజు ఫలితాలున్యూ ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ జూలైలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో మొత్తం 24 స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభసభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలను భర్తీ చేసేందుకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. జూన్ 1న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. జూన్ 18న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నది ఎలక్షణ్ కమిషన్. కర్ణాటక నుంచి పదవీకాలం పూర్తవుతున్న రాజ్యసభ సభ్యులు.. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, హెచ్డీ దేవగౌడ. మధ్యప్రదేశ్ నుంచి దిగ్విజయసింగ్ పదవీ కాలం ముగియనుంది.

CHANDU · 5 నెలల క్రితం
లీగల్ వార్తలు

కాక్రోచ్ "ఎక్స్" అకౌంట్ నిలిపివేత

( న్యూస్ ప్రత్యేక ప్రతినిధి )ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న పొలిటికల్ శటైరికల్ అకౌంట్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)కి గట్టి షాక్ తగిలింది. భారతీయ రాజకీయాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఈ అకౌంట్‌ను భారత్‌లో ఎక్స్ (ట్విట్టర్) సంస్థ నిలిపివేసింది. కేవలం కొద్ది రోజుల్లోనే విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ అకౌంట్, ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను సైతం దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీకి 8.8 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఏకంగా 13.2 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం విశేషం. ఈ రేంజ్‌లో దూసుకుపోతూ, మంచి మొమెంటం అందుకుంటున్న సమయంలోనే ఈ అకౌంట్‌పై నిషేధం పడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఈ పరిణామంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందించారు. తన ఎక్స్ ఖాతాను ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తున్న పాప్-అప్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ, “మనం ముందే ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను ఇండియాలో విత్‌హెల్డ్ చేశారు” అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఎక్స్‌లో `@CJP_2029` అనే యూజర్‌నేమ్‌తో ఉన్న ఈ అకౌంట్‌ను ఓపెన్ చేస్తే.. ‘అకౌంట్ విత్‌హెల్డ్’ అని బోల్డ్ అక్షరాలతో కనిపిస్తోంది. అంతేకాదు, ఒక చట్టపరమైన డిమాండ్ (లీగల్ డిమాండ్) కు స్పందనగా భారతదేశంలో ఈ అకౌంట్‌ను నిలిపివేసినట్లు అక్కడ స్పష్టంగా రాసి ఉంది.అసలు ఈ అకౌంట్‌ను ఎందుకు నిలిపివేశారనే విషయానికి వస్తే.. ఎక్స్ సంస్థ నిబంధనల ప్రకారం ఏదైనా అధికారిక సంస్థ లేదా ప్రభుత్వం నుంచి సరైన చట్టపరమైన అభ్యర్థన వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకుంటారు. స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు తేలినా లేదా చట్టపరమైన ఆదేశాలు వచ్చినా.. ఆయా దేశాల పరిధి వరకు మాత్రమే సదరు కంటెంట్ లేదా అకౌంట్ కనిపించకుండా యాక్సెస్‌ను నిలిపివేస్తామని ఎక్స్ సంస్థ వివరించింది. చట్టపరమైన డిమాండ్ల వల్లే ఈ వ్యంగ్య పొలిటికల్ అకౌంట్‌పై ఇండియాలో ఈ విధమైన పరిమితి విధించాల్సి వచ్చిందని కంపెనీ స్పష్టం చేసింది.

PRASANNA · 5 నెలల క్రితం
ప్రకటన (Advertisement)
లీగల్ వార్తలు

లక్ష్యంతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ఎల్.కోట :విజయనగరం జిల్లా. ఎల్.కోట మండలం, గంగుబూడి గ్రామంలో శ్రీ సత్యసాయి దివ్యామృతం వ్యవస్థాపకులు స్వామి గారి ఆధ్వర్యంలో ఇటీవల విడుదలైన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం ఫలితాలలో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ముఖ్య అతిధిగా హాజరై, విదార్ధిని, విధ్యార్ధులు, తల్లితండ్రులు, ప్రజలతో మమేకమయ్యారు. శ్రీ సత్యసాయి దివ్యామృతం నిర్వాహకులు జిల్లా ఎస్పీ కి సాదరంగా స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, మాట్లాడుతూ – విద్యార్థులు చిన్నప్పటినుంచే లక్ష్యాలను నిర్దేసించుకొని క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని తెలిపారు. ఇటీవల విడుదలైన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం ఫలితాలలో విజయనగరం జిల్లా, ఎల్.కోట మండలం, గంగుబూడి గ్రామానికి చెందిన బాలికలు కుమారి వై.ఉమా పార్వతి పదవ తరగతి ఫలితాలలో 594 మార్కులు, అదేవిధంగా కుమారి కొసురు పూర్ణిమ ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం ఫలితాలలో 464 మార్కులు సాధించి జిల్లాలో ప్రధమ స్థానాలలో నిలిచి తమ తల్లితండ్రులకు, గురువులకు, ఊరికి, పాఠశాలకు మరియు విజయనగరం జిల్లాకు మంచి పేరు తెచ్చారని, మిగతా విద్యార్ధులకు ఆదర్శంగా నిలిచారని జిల్లా ఎస్పీ తెలిపారు. పల్లెటూరులో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని జిల్లాలో ప్రధమ స్థానం సాధించటం నిజంగా ఒక గొప్ప విషయం అని జిల్లా ఎస్పీ కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విదార్ధులు ప్రైవేటు పాఠశాల విదార్దులతో పోటీ పడే స్థాయికి చేరుకున్నారని, ఇది మంచి పరిణామమని జిల్లా ఎస్పీ తెలిపారు. విదార్ధులు చదువుతోపాటు సాంకేతికంగా వచ్చే మార్పులను గమనిస్తూ, అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ఇందులో భాగంగా భోగాపురంలో విమానాశ్రయం వస్తుందని, మనకి దగ్గరలో గూగుల్ డేటా సెంటర్ కూడా వస్తుందని తెలిపారు. విద్యార్ధులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకొని, తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగి, మంచి విజయాలను సాధించి తల్లితండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. శ్రీ సత్యసాయి దివ్యామృతం వ్యవస్థాపకులు స్వామి గారు ప్రజలకు అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ కొనియాడారు.మహిళలు మరియు పిల్లల రక్షణ, భద్రతకు జిల్లా పోలీసుశాఖ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని, ఇందులో భాగంగా జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలు చేపదుతున్నామని తెలిపారు. ఆపద సమయాల్లో తమ స్వీయ రక్షణకు ఆత్మరక్షణ మెళుకువలు విద్యార్ధినులకు నేర్పించడం, వారికి రక్షణగా ఉండే చట్టాలు పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. చదువుకొనే సమయంలో విద్యార్థులు చెడు మార్గంలో పయనించకుండా లక్ష్య సాధన వైపు నడవాలన్నారు. యువత గంజాయి జోలికి పోవద్దని, గంజాయి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే 1972కు సమాచారం అందించాలని కోరారు. ప్రతీ ఒక్కరూ ద్విచక్ర వాహనంపై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, “అమ్మ జన్మనిస్తే – హెల్మెట్ పునర్జన్మని ఇస్తుందని” జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలకు ఏ అపాయం వచ్చినా డయల్ 100/112 ఫోన్ చేసి, పోలీసులు సహాయం పొందవచ్చునని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు.అనంతరం జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన కుమారి వై.ఉమా పార్వతి మరియు కుమారి కొసురు పూర్ణిమలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు సన్మానించి, మేమోంటోలు అందచేసారు.ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి దివ్యామృతం వ్యవస్థాపకులు స్వామి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ముర్రు ముత్యాలనాయుడు, ఎస్.కోట రూరల్ సిఐ ఎల్.అప్పలనాయుడు, ఎల్.కోట ఎస్ఐ రామకృష్ణ, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SATISH RAJ · 5 నెలల క్రితం · Andhra Pradesh, Vizianagaram
లీగల్ వార్తలు

కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన విశాఖ నగర పోలీసులు.

విశాఖ క్రైమ్ :డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ll - టౌన్ మరియు దువ్వాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ దృష్ట్యా "కార్డన్ & సెర్చ్" ఆపరేషన్ నిర్వహించి, ప్రతి ఇంటిని నిశితంగా తనిఖీ చేసి, 45 మద్యం బాటిళ్లు మరియు సరియైన ధృవపత్రాలు లేని 10 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడమైనది.

SATISH RAJ · 5 నెలల క్రితం
లీగల్ వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) లోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో హెచ్‌ఆర్‌డి వైస్‌ చైర్‌పర్సన్ శాంతి కుమారి గారు, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి ఉషా రాణి ఉన్నారు.ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లు ఎట్టబోయిన సాయి శివాని, సచిన్ బసవరాజ్ గుత్తూర్, పోతరాజు హరి ప్రసాద్, పారస్ కుమార్, పి. సురేష్, నెలటూరు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.

RAJ · 5 నెలల క్రితం · Telangana, Hyderabad
లీగల్ వార్తలు

ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డ్ లను అందజేసిన ; సీపీ డా.శంఖబ్రత బాగ్చి

విశాఖ క్రైమ్: సిబ్బంది సంక్షేమంతో పాటుగా వారు అందించిన సేవల యందు ప్రతిభను గుర్తిస్తూ, ఉన్నతాధికారుల సమక్షంలో 203 మందికి రివార్డులను బుధవారం ఉదయం నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి అందజేశారు. క్రైమ్ రివ్యూ మీటింగ్ నందు గత నెల ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది సేవలను ప్రోత్సహిస్తూ 203 మందికి రివార్డ్ మంజూరు ఆర్డరును అందజేయడం,అలాగే .నగర పోలీసు శాఖ నందు హోంగార్డు నుండి సిఐ స్థాయి అధికారుల వరకూ వారు నిర్వహిస్తున్న విధులకు తగ్గా గుర్తింపు ఇస్తూ, ప్రతి నెలా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి తగు రివార్డులు అందజేసి, వారు సమర్ధవంతముగా విధులు నిర్వహిస్తూ తోటి సిబ్బందికి ప్రేరణ ఇస్తూ అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం మరింత సురక్షితముగా ఉండే దిశగా సిపి చర్యలు తీసుకున్న విషయం విధితమే. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ నగరం గుండా రవాణా అవుతున్న గంజాయిని సీజ్ చేసిన పలు కేసులలో, చోరీ కాబడిన సొత్తు,ఇతర వస్తువులను రికవరీ చేసి, నిందితులను అరెస్టు చేసిన పలు కేసులలో, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పేరుమోసిన నేరస్తులను అరెస్టు చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన కేసులో, సైబర్ క్రైమ్ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 203 మంది, హోం గార్డు నుండి సీ.ఐ వరకూ గల సిబ్బందికి రివార్డులు మంజూరు చేసి, సిబ్బంది అందరూ ప్రేరణ చెంది మరింత మెరుగ్గా విధులు నిర్వర్తించేలా క్రైమ్ మీటింగ్ కు నందు నగర పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో రివార్డు మంజూరు ఆర్డరును ఇవ్వడం జరిగినది.

PRASAD · 5 నెలల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
లీగల్ వార్తలు

ఎస్‌సీటీపీసీ పోలీస్ శిక్షణార్థులకు అత్యవసర వైద్య సేవలపై ప్రత్యేక శిక్షణ

విజయనగరం, మే 20: విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ కమాండెంట్ వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 191 మంది SCTPC (Stipendiary Cadet Trainee Police Constable) శిక్షణార్థులకు నాలుగు రోజుల పాటు అత్యవసర వైద్య సేవలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. బి. దేవి మాధవి తెలిపారు.పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణలో ప్రమాదాలు, గుండెపోటు, మునిగిపోవడం, శ్వాస ఆడకపోవడం వంటి అత్యవసర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, అలాంటి సందర్భాలలో తక్షణ వైద్య సహాయం అందించగల నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS), అత్యవసర చికిత్స విధానాలు, గాయపడిన వ్యక్తులకు ప్రాథమిక చికిత్స అందించే పద్ధతులు, గుండెపోటు వచ్చినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, శ్వాస ఆడకపోతే చేయవలసిన సహాయక చర్యలపై శిక్షణ అందించబడిందన్నారు.ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన వైద్య బృందం ఆధ్వర్యంలో డమ్మీ మానికిన్స్ (Mannequins) సహాయంతో ప్రాక్టికల్ శిక్షణ నిర్వహించబడిందని తెలిపారు. శిక్షణలో పాల్గొన్న పోలీస్ శిక్షణార్థులు అత్యంత ఆసక్తి కనబరిచారని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ డా. బి. దేవి మాధవి పేర్కొన్నారు.

SATISH RAJ · 5 నెలల క్రితం · Andhra Pradesh, Vizianagaram
ప్రకటన (Advertisement)
హోమ్
లైవ్ TV
ఈ-పేపర్
Loading Live...
లైవ్ TV (Live)