ఆలమూరు: ఆలమూరు మండలం చింతలూరులో కొలువై ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో శనివారం చండీ హోమం పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ పవిత్ర హోమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లోకకల్యాణం కోసం ప్రార్థనలు చేశారు.అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని, సమాజం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ పూజా కార్యక్రమాన్ని భక్తిపూర్వక వాతావరణంలో నిర్వహించారు. చండీ హోమం ద్వారా అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ప్రసరించాలని, అందరికీ మేలు జరగాలని ఆకాంక్షించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఉండవల్లి వీర్రాజు చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వీరి అప్పారావు గౌడ్, ధర్మకర్తల మండలి సభ్యులు, అమ్మవారి భక్తులు, మహిళలు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.