రోడ్లు వెయ్యకుండా రోడ్డు టాక్స్ పేరుతో సెస్ వసూలు చేసిన ఘనత వైయస్ జగన్ ది..
ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.
కొత్తపేట :
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసనల పేరుతో వైసిపి నాయకులు రిక్షాలు తొక్కి ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. మంగళవారం రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. 2019 నుంచి 24 వరకు జగన్ పాలనలో డీజిల్ రేట్లు 22 నుంచి 27 శాతానికి, పెట్రోల్ రేట్లు 31 నుంచి 35 శాతానికి పెరిగాయన్నారు. వైసీపీ పాలన ఐదేళ్లలో ఒక్క లీటర్ పెట్రోల్ ధర 2019 తో పోలిస్తే 41 రూపాయలు పెరిగిందన్నారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో పాటు వైసిపి ప్రభుత్వం సైతం సెస్ పేరుతో పెట్రోల్ ధరల భారాన్ని ప్రజలపై వేసిందన్నారు. ఈ సందర్భంగా అప్పట్లో తెలుగుదేశం పార్టీ నిరసన తెలియజేస్తే అప్పటి మంత్రి కొడాలి నాని ఏకవచనంతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై నిరసనలు తెలియజేస్తే వెళ్ళి కేంద్రం వద్ద చేయాలి కానీ రాష్ట్రంలో చేస్తారా? అంటూ దుర్భాషలాడిన వీడియోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయన్నారు. ఇప్పుడు పెరిగిన ధరలు ఎవరు పెంచారో వైసీపీ నాయకులు గమనించకుండానే రిక్షాలు తొక్కడం సరైనదేనా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా పెట్రోల్ ధర గాని డీజిల్ ధర కాని పెంచలేదన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో దేశంలోనే అత్యధికంగా పెట్రోల్,డీజిల్ రేట్లు మన రాష్ట్రంలో పెరిగాయన్నారు. ఒక్క రోడ్డు కూడా నిర్మించకుండా, గుంతలయినా పూడ్చకుండా రోడ్ డెవలప్మెంట్ సెస్ పేరుతో పెట్రోల్, డీజిల్ పై పన్నులు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చితే అప్పట్లో మన రాష్ట్రంలోనే లీటరుకు రూ.5నుంచి రూ.10 వరకు ధరలు అధికంగా ఉండేవన్నారు. అటువంటిది ఇప్పుడు డ్రామాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఎందుకు పెరిగాయో ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య జరిగిన యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయన్నారు. ప్రతిపక్షంగా ఏదో తమ ఉనికి కాపాడుకోవడం కోసం ఇక్కడి నాయకులు హడావుడి చేస్తున్నారన్నారు. ఈ అంశాలన్నీ ప్రజలు పరిశీలిస్తున్నారన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు డ్రామాలు కట్టి పెట్టాలన్నారు. లేకుంటే వారు మరింతగా ప్రజల్లో పలచన అయ్యే అవకాశం ఉందన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ నిరసనలు హాస్యాస్పదం
రాజకీయం
GANTA MADHU
4 వారాల క్రితం
AI సారాంశం
రోడ్లు వెయ్యకుండా రోడ్డు టాక్స్ పేరుతో సెస్ వసూలు చేసిన ఘనత వైయస్ జగన్ ది.. ఎమ్మెల్యే బండారు సత్యానం
మొదటి వ్యాఖ్య రాయండి!