( వన్ సినిమా )

తమిళంతో పాటు ఇటు టాలీవుడ్‌లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న రాక్‌స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌తో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచారు. ఇటీవలే వచ్చిన ‘జైలర్ 2’ గ్రాండ్ సక్సెస్‌తో పాటు సన్ నెట్‌వర్క్ వారసురాలు, ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్‌తో ఆయన పెళ్లి ఖరారు కావడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రమంలో గతంలో ఆయనతో ముడిపడి ఉన్న హీరోయిన్ల డేటింగ్ రూమర్లు, పాత లవ్‌స్టోరీలు మళ్లీ నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతున్నాయి.అనిరుధ్ పేరు ప్రస్తుతం ఇండియా మొత్తం మార్మోగిపోతోంది. ఒకవైపు ‘జైలర్ 2’ సినిమాలో ఆయన అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఊపేస్తుంటే, మరోవైపు పెళ్లి వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. కావ్య మారన్, అనిరుధ్‌ల వివాహం వచ్చే నెలలో గ్రీస్‌లో అత్యంత సన్నిహితుల మధ్య జరగనుండగా, నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఇక సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ దంపతులు స్వయంగా రాజకీయ, సినీ ప్రముఖులను ఇన్వైట్ చేస్తుండటంతో ఈ వార్త అధికారికంగా నిరూపితమైంది.కళానిధి మారన్ ఆస్తుల విలువ దాదాపు రూ.26 వేల కోట్లు కాగా, ఆ భారీ సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు కావ్య మారన్. ఆమెనే అనిరుధ్ పెళ్లి చేసుకోబోతుండటంతో మన ‘బక్కోడు’ ఒక్కసారిగా వేల కోట్లకు అధిపతి అయ్యాడంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్ట్‌లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 
                 ఇక వినోద, వ్యాపార రంగాలకు చెందిన ఈ బిగ్గెస్ట్ కపుల్ కాంబినేషన్ చూసి అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.అనిరుధ్ లవ్ లైఫ్ గురించి మాట్లాడితే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు నటి, సింగర్ ఆండ్రియా. తనకంటే ఆరేళ్లు పెద్దదైన ఆండ్రియాతో అనిరుధ్ దాదాపు ఆరేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆ సమయంలో వీరిద్దరూ ముద్దులు పెట్టుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో లీక్ అవ్వడం అప్పట్లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ లీకేజ్ వివాదం జరిగిన కొన్ని రోజులకే వీరిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు.ఆండ్రియాతో బ్రేకప్ తర్వాత అనిరుధ్ పేరు పలువురు హీరోయిన్లతో వినిపించింది. ‘3’ సినిమా టైమ్‌లో శ్రుతిహాసన్‌తో, అలాగే ప్రియా ఆనంద్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ రూమర్లు వచ్చాయి. అయితే ప్రియా ఆనంద్ తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఇక మహానటి కీర్తి సురేష్, పాపులర్ సింగర్ జోనితా గాంధీలతో కూడా అనిరుధ్ డేటింగ్ చేశారనే ప్రచారం జరిగింది. కానీ కీర్తి సురేష్ అవన్నీ అబద్ధాలని చెప్పి, తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని ఆ రూమర్లకు చెక్ పెట్టారు.
                     ఇక మొత్తానికి చూస్తే, ఎన్నో లవ్ రూమర్లు, డేటింగ్ వివాదాల తర్వాత అనిరుధ్ రవిచందర్ లైఫ్ ఇప్పుడు కావ్య మారన్‌తో పెళ్లి పీటలు ఎక్కుతోంది. ఒకవైపు సౌత్ ఇండియాలో అగ్ర సంగీత దర్శకుడిగా తనకంటూ తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అనిరుధ్, కావ్యతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుండటంపై ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.