( వన్ సినిమా )
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఒకానొక దశలో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా ఇండస్ట్రీ వేధింపులు తట్టుకోలేక సినిమాలు వదిలేద్దామని కూడా అనుకుందట. అయితే గుండె ధైర్యం చేసుకొని ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు మళ్ళీ ఈ స్థాయికి వచ్చాను అంటూ ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.భద్రప్ప గాజుల దర్శకత్వంలో వీకే నరేష్ తరుణ్ భాస్కర్ , అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో అనుపమ పరమేశ్వరన్ లీడ్రోల్ పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం క్రేజీ కల్యాణం.
నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న అనుపమ.. తన వ్యక్తిగత జీవితంపై, ఇండస్ట్రీ తీరుపై, భార్యాభర్తల బంధంపై ఇలా ఎన్నో విషయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.క్రేజీ కళ్యాణం ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ మాట్లాడుతూ..”గతంలో వేధింపుల వల్ల ఎంతగానో కృంగిపోయానని, ఒక దశలో సినిమాలే మానేద్దామని అనుకున్నట్లు అనుపమ పరమేశ్వరన్ తెలిపారు. అద్దంలో చూసుకుంటే నేనేనా అనిపించేది .
రోజు గడిచేసరికి ఈరోజు బతికిపోయాను దేవుడా అనుకునేదాన్ని. అయినా ధైర్యం కోల్పోకుండా నిలబడ్డాను. అంటూ అనుపమ చేసిన ఇదే ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. జీవితమే ఒక సవాలుగా మారిపోయింది. ఆ పరిస్థితిలో నటన కూడా మానేద్దాం అనుకున్నాను. కానీ ధైర్యంగా ముందుకు నడిచాను. నిజానికి ఇలాంటి విషయాలపై బహిరంగంగా మాట్లాడినప్పుడు విమర్శలు వస్తాయని భావించాను. కానీ చాలామంది నాకు ఎంతో మద్దతు ఇచ్చారు. నా అనుభవాలు కొందరిలో అయినా ధైర్యం నింపుతాయనుకుంటే నేను ఎన్ని విమర్శలకైనా సిద్ధమే అంటూ అనుపమ చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అలాగే డబ్బుల కోసం నటించడంపై కూడా ఈమె స్పందించింది. నేనెప్పుడూ కూడా వైవిద్య భరితంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాను. నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు అనుకోకూడదు. నా పాత్రను చూసే ఆ సినిమా పేరు ఏంటో ప్రేక్షకులు చెప్పగలగాలి. అంత ప్రత్యేకంగా ఉండేలా నా కథల్ని, పాత్రలని ఎంచుకుంటాను. కేవలం డబ్బుల కోసమే నటించాలని అనుకోను. ఏదో కొత్తగా ప్రయత్నించాలనే ప్యాషన్ నన్ను నడిపించాలి. ముఖ్యంగా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు నాకు దొరికిన అనుభవం ఇప్పటికీ నా నటనలో స్క్రిప్ట్ సెలక్షన్ లో ఎంతో సహాయపడుతోంది. అంటూ తెలిపింది.
మొదటి వ్యాఖ్య రాయండి!