ఓల్డ్ టౌన్ :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఆంధ్ర ప్రదేశ్ ధార్మిక పరిషత్ వారి ఉత్తర్వులు అనుసరించి విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ లో వేంచేసియున్న శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలిని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సి హెచ్ వంశీ కృష్ణ శ్రీనివాస్ మరియూ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో ధర్మ కర్తల మండలి సభ్యులచే పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మ కర్తల మండలి సభ్యులుగా సురాడ రాజ్ కుమార్, బుదిరెడ్ల సత్యనారాయణ, రాయ రాము, ఉప్పలపు ఆదిలక్ష్మి, సరిపల్లి జ్యోతి, పుక్కల కళ్యాణి, మానేపల్లి రమణి, నాగమల్లి భాస్కర రావు, బోనగిరి విజయదుర్గ, మంత రాజశేఖర్, మంత్రి శాలివాహన్ మరియు ఎక్స్- అఫిషియో సభ్యునిగా ఆలయ ప్రధాన అర్చకులు పాణంగిపల్లి జగన్నాథ ఆచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మకర్తల మండలి చైర్మన్ గా సురాడరాజ్ కుమార్ ని పై సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సభ్యులందరినీ అభినందిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఆలయ పరిరక్షణకై శ్రమిస్తూ భక్తుల మన్నలను పొందెలాగ కూటమి ప్రభుత్వమునకు, దేవాలయానికి మంచి పేరు ప్రతిష్ఠలు తీస్కొనిరావాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో శివ ప్రసాద్ రెడ్డి, శ్కందులనాగరాజు, మాసిపోగురాజు, కోరుకొండ ప్రసాద్ కేదారి లక్ష్మి , మజ్జి త్రినాథ్, గోడి నరసింహచారి, ఓదూరు శివయ్య మరియు ఇతర రాజకీయ ప్రముఖులు, ధర్మకర్తల మండలి వారి బంధువులు, మిత్రులు సమక్షమున ప్రమాణ స్వీకారం దిగ్విజయంగా జరిగింది. పాల్గొన్న అందరికీ ప్రసాదం, మజ్జిగ, అందచేయగా దేవస్థానం ఏర్పాట్లు పై అందరూ హర్షం వ్యక్తంచేశారు.
మొదటి వ్యాఖ్య రాయండి!