నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపల్ టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థి పేరు ఖరారైంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి టిడిపి తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా ఎన్నికలలో నిలబడబోతున్నారు. ఆమె శుక్రవారం ఉదయం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీ నూకాంబిక ఆలయంలో పూజల అనంతరం నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.