----రాష్ట్ర స్థాయి పోటీలకు తూర్పుగోదావరి జిల్లా జట్టుకు ఎంపికైన వి. హేమంత్ శ్రీనివాస్

ఆలమూరు :  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి వి. హేమంత్ శ్రీనివాస్ కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి జూనియర్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా జూనియర్స్ కబడ్డీ జట్టుకు హేమంత్ శ్రీనివాస్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ-1 బి. అప్పాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల రాజమహేంద్రవరంలోని ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో హేమంత్ శ్రీనివాస్ తన ప్రతిభను చాటుకుని జిల్లా జట్టులో స్థానం సంపాదించాడు. ఈ సందర్భంగా విద్యార్థి విజయానికి కృషి చేసిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) ఎన్. వీరాంజనేయులును ప్రధానోపాధ్యాయులు బి. అప్పాజీ అభినందించారు.