స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: చంద్రబాబు
రాజకీయం
MUNI SWAMY
2 గంటల క్రితం
AI సారాంశం
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. కూటమి అభ్యర్థుల
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని స్పష్టంచేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన తరువాత సహచర మంత్రులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నవంబర్ 15 నాటికి ఎన్నికలు పూర్తి చేసి, రెగ్యులర్ పాలనలోకి వెళ్లాలన్నారు. స్థానిక ఎన్నికల్లో 100శాతం గెలవాల్సిందేనని చెప్పారు. మంత్రులు మరింత చురుగ్గా ఉండటంతోపాటు, కూటమి అభ్యర్థుల విజయానికి ఏవిధంగా ముందుకెళ్లాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు.
మొదటి వ్యాఖ్య రాయండి!