ఎచ్చెర్ల (న్యూస్ వన్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ,లోమాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శ,ప్రాయమని
డాక్టర్. బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ రజని కొనియాడారు. అబ్దులకలాం జయంతి సందర్భంగా గురువారం యూనివర్సిటీ ఆవరణలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతరిక్ష, రక్షణ రంగాల్లో ఆయన ఎన్నో పరిశోధనలుచేసి ముందుతరాలకు మార్గదర్శకులుగా నిలిచారని అన్నారు. శాస్త్రవేత్తగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగానే కాకుండా, రాష్ట్రపతిగా పనిచేసి పీపుల్స్ ప్రెసిడెంట్గా కీర్తి గడించారని పేర్కొన్నారు. దేశానికి, సమాజానికి కలాం అందించిన సేవలను వీసీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. అడ్డయ్య, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఏ.పీ.జే. అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం
క్రీడలు
RAMA RAO
ఒక గంట క్రితం
AI సారాంశం
ఎచ్చెర్ల (న్యూస్ వన్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ,లోమా
మొదటి వ్యాఖ్య రాయండి!