సబ్బవరం :
యువతకు శక్తినిస్తూ – నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తూ ముగిసింది ఎన్ సి సి శిబిరం. బుధవారం ఉదయం అనకాపల్లి జిల్లా సబ్బవరం లో ఉన్న దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం లో అద్భుతమైన ఎన్ సి సి పాసింగ్ అవుట్ పరేడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో 10 రోజుల వార్షిక శిక్షణ శిబిరం ముగిసింది. యువతలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, దేశభక్తి మరియు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన శిక్షణ క్యాడెట్ల కు బాగా ఉపకరిస్తుంది. శిబిరం చివరి రోజు ఉత్సాహభరిత వాతావరణంలో అద్భుతమైన పాసింగ్ అవుట్ పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఘన పరేడ్‌ను గ్రూప్ కమాండర్ కమోడోర్ సుమంత రాయ్ సమీక్షించారు. ఐదు విభిన్న దళాలుగా పాల్గొన్న క్యాడెట్లు అత్యంత క్రమశిక్షణతో, సమన్వయంతో ప్రదర్శించిన డ్రిల్ అందరినీ ఆకట్టుకుంది. ఈ పరేడ్‌కు సీనియర్ అండర్ ఆఫీసర్ ఈశ్వర్ రావు నాయకత్వం వహించారు.పరేడ్ అనంతరం కమోడోర్ సుమంత రాయ్ మాట్లాడుతూ, క్యాడెట్ల అద్భుతమైన ప్రదర్శనను అభినందించారు. శిబిరంలో నేర్చుకున్న క్రమశిక్షణ, పర్యావరణ చైతన్యం, జీవిత నైపుణ్యాలు భవిష్యత్తులో వారిని ఉత్తమ నాయకులుగా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు.
10 రోజుల శిబిరంలోని ముఖ్యాంశాలు :
సైనిక మరియు వ్యూహాత్మక శిక్షణలు క్యాడెట్లు ఆయుధ వినియోగంపై ప్రత్యక్ష శిక్షణ పొందారు. .22 రైఫిల్‌తో ఫైరింగ్ సాధన నిర్వహించబడింది. మ్యాప్ రీడింగ్ ద్వారా భూభాగ అవగాహన, అలాగే అడ్డంకుల శిక్షణ ద్వారా శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నారు.నౌకాదళ మరియు వారసత్వ అవగాహన క్యాడెట్లు ఐఎన్ఎస్ కురుసురా సబ్‌మెరైన్ మ్యూజియం, నావల్ మ్యూజియంను సందర్శించి భారత నౌకాదళ చరిత్ర, సముద్ర రక్షణ వైభవం గురించి తెలుసుకున్నారు.పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో విత్తన బంతులు తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సంకల్ప ఆర్గానిక్ విలేజ్ సందర్శనతో పాటు భారీ వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు తమ నిబద్ధతను చాటిచెప్పారు.ప్రాణరక్షణ నైపుణ్యాలు మరియు నిపుణుల ఉపన్యాసాలు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ విశాఖపట్నం, అగ్నిమాపక శాఖ బృందాలు విపత్తు నిర్వహణ, అగ్నిప్రమాద నియంత్రణ వంటి కీలక అంశాలపై శిక్షణ ఇచ్చాయి.మేధో, క్రీడా పోటీలు క్యాడెట్ల మధ్య క్రీడా పోటీలు, క్విజ్ తదితర పోటీలు నిర్వహించి ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించారు.సాంస్కృతిక ముగింపు కార్యక్రమం అధికారిక పరేడ్ అనంతరం శిబిరం సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. సంగీతం, నృత్యం, నాటికల ద్వారా క్యాడెట్లు తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించి, 10 రోజుల పాటు ఏర్పడిన ఐక్యత, స్నేహభావం, భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించారు.ఈ కార్యక్రమంలో న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్యప్రకాష్ చేతులు మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ పదిరోజులు శిక్షణ కార్యక్రమాలు లెఫ్ట్ నెంట్ కల్నల్ నీరజ్ కుమార్ అధ్యక్షతన జరిగాయో. ఈ కార్యక్రమంలో కమాండింగ్ ఆఫీసర్ స్వర్ణిం ప్రభాత్, సుభేదార్ మేజర్ డి రాజేంద్రన్, సుభేధార్ ఆర్డినరీ కెప్టెన్ జి శ్రీధర్, మేజర్ కళ్యాణ్ అశోక్, లెఫ్ట్ నెంట్ వి సన్యాసి నాయుడు, లెఫ్ట్ నెంట్ ఉదయ్ కిరణ్, చీఫ్ ఆఫీసర్ లత, కుమార్ చంద్ర గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొన్నారు.
మొదటి వ్యాఖ్య రాయండి!