--జేకే 250ఈ డ్రోన్‌కు డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్
--తొలి హైబ్రిడ్ ఫిక్స్డ్-వింగ్, మల్టీ-రోటర్ యూఏవీగా జేకే 250ఈ
న్యూ ఢిల్లీ , అక్టోబర్ 15:
స్వదేశీ మానవరహిత వైమానిక వాహనాల (యూఏవీ) తయారీలో మరో కీలక మైలురాయిని డ్రోగో ఏరోస్పేస్ అధిగమించింది. సంస్థ అభివృద్ధి చేసిన జేకే 250ఈ ఫిక్స్డ్-వింగ్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీఓఎల్) డ్రోన్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) టైప్ సర్టిఫికేషన్ లభించింది. దీంతో సంస్థ సాధించిన డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్ల సంఖ్య ఆరుకు చేరింది.
హైబ్రిడ్ ఫిక్స్డ్-వింగ్, మల్టీ-రోటర్ కాన్ఫిగరేషన్‌తో రూపొందిన యూఏవీల్లో శిక్షణ ప్రయోజనాల కోసం డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్ పొందిన దేశంలోనే తొలి డ్రోన్ జేకే 250ఈ అని సంస్థ సి ఈ ఓ యశ్వంత్ బొంతు తెలిపారు . ఈ గుర్తింపు స్వదేశీ డ్రోన్ సాంకేతికతతో పాటు యూఏవీ ఆపరేటర్లకు శిక్షణ అందించే దేశీయ సామర్థ్యాల అభివృద్ధికి దోహదపడనుంది.
నిఘా, పర్యవేక్షణ అవసరాలకు అనుగుణంగా :
భారత రక్షణ దళాల నిఘా, పర్యవేక్షణ, సమాచార సేకరణ (ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ అండ్ రికనైసెన్స్–ఐఎస్ఆర్) అవసరాలను దృష్టిలో ఉంచుకుని జేకే 250ఈని రూపొందించారు. సంప్రదాయ స్థిర-రెక్కల విమానాల సామర్థ్యాన్ని నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేసే సౌకర్యంతో మిళితం చేయడం దీని ప్రత్యేకత. దీనివల్ల సంప్రదాయ రన్‌వే అవసరం లేకుండానే కార్యకలాపాలు నిర్వహించవచ్చు. రెండు నుంచి మూడు గంటల పాటు గగనతలంలో ఉండగల ఈ డ్రోన్ సుదీర్ఘ నిఘా, పర్యవేక్షణ కార్యకలాపాలకు అనువుగా ఉంటుంది.
డ్రోగో ఏరోస్పేస్ ఇప్పటికే జేకే 250ఈ డ్రోన్లను భారత సైన్యానికి అందించింది. రక్షణ రంగ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ యూఏవీ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఇది కీలక ముందడుగుగా నిలిచింది.
ఆరు టైప్ సర్టిఫికేషన్లతో :
జేకే 250ఈకి లభించిన తాజా గుర్తింపుతో డ్రోగో ఏరోస్పేస్ సాధించిన డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్ల సంఖ్య ఆరుకు చేరింది. స్వదేశీ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, విమాన భద్రతా ప్రమాణాలు, నియంత్రణ నిబంధనల అనుసరణలో సంస్థ సాధిస్తున్న పురోగతికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.డ్రోగో ఏరోస్పేస్ చీఫ్ యశ్వంత్ బొంతు మాట్లాడుతూ, జేకే 250ఈకి లభించిన సర్టిఫికేషన్ రక్షణ, శిక్షణ అవసరాలకు స్వదేశీ యూఏవీ సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో కీలక మైలురాయని తెలిపారు. స్వదేశీ సాంకేతికతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడంతోపాటు భారత రక్షణ, ఏరోస్పేస్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు కృషి కొనసాగిస్తామని పేర్కొన్నారు.
రక్షణ రంగంలో డ్రోగో ఏరోస్పేస్‌కు మరో ఘనత
వార్తలు
SWETHA SINGH
2 గంటల క్రితం
AI సారాంశం
--జేకే 250ఈ డ్రోన్‌కు డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్ --తొలి హైబ్రిడ్ ఫిక్స్డ్-వింగ్, మల్టీ-రోటర్ య
మొదటి వ్యాఖ్య రాయండి!