చెముడులంకలో ఉచిత మెగా వైద్య శిబిరం
వార్తలు
GANTA MADHU
52 నిమిషాల క్రితం
AI సారాంశం
ఆలమూరు : డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో శనివారం ఉచిత మెగా వైద్య
ఆలమూరు : డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభమైంది.గ్రామ మాజీ సర్పంచ్ నాగిరెడ్డి వెంకట రత్నం*ఆహ్వానం మేరకు, ఉమెన్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఛైర్మన్ బూసి విద్యా ప్రసన్న ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ కృష్ణదేవరాయ కాపు కళ్యాణమండపం, చెముడు లంక రాజమండ్రికి చెందిన ప్రముఖ ఆసుపత్రులు శ్రీకర మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్, గౌతమి నేత్రాలయం, రమా దంత వైద్యశాల కు చెందిన నిపుణులైన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని బీపీ, షుగర్, ఈసీజీ, గుండె, ఎముకలు-కీళ్లకు సంబంధించిన పరీక్షలు, కంటి, దంత పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.మహిళలకు లేడీ డాక్టర్లచే ప్రత్యేక పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ, ఉచిత కంటి ఆపరేషన్లు, 50% రాయితీపై కళ్లజోళ్లు అందజేశారు. గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
మొదటి వ్యాఖ్య రాయండి!