వైసిపి పార్టీ విశాఖ పశ్చిమ యాదవ్ విభాగం అధ్యక్షులు ప్రసాద్ యాదవ్

గోపాలపట్నం :  విశాఖ జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న యాదవ సామజక వర్గానికి యాదవ్ సామాజిక భవనం నిర్మించకపోవడం బాధాకరమని  గత వైసిపి  ప్రభుత్వం యాదవ్ సామజక వర్గానికి అర ఎకరం స్థలం జీవో ఇచ్చి మేలు చేశారని 2024 కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ స్థలం జీవో క్యాన్సిల్ చేసి మరొక ప్రదేశాన్ని ఇచ్చారని  మంత్రి కొలుసు పార్థసారథి  మీడియా ముందుకు వచ్చి చెప్పారని కానీ ఇప్పటివరకు కూడా  శంకుస్థాపన కాదు కదా ఆ స్థలం ఎక్కడుందో* తెలియదని యాదవ్ సామజక వర్గానికి మోసం చేశారని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ పార్టీ యాదవ్ విభాగం అధ్యక్షులు ప్రసాద్ యాదవ్ తెలిపారు..ఇప్పటికైనా యాదవ సోదరులు ఆలోచించి  జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలిపారు. విశాఖ నగరంలో గత వైసిపి ప్రభుత్వం లో యాదవ్ సామజక వర్గానకి న్యాయం చేసే ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దని తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అబద్దాలు హామీలు ఆపాలని  గత ప్రభుత్వంలో యాదవ సామాజిక  వర్గానికి ఎమ్మెల్సీ మేయర్, విఎంఆర్డిఏ చైర్మన్, కీలకమైన పదవులు ఇచ్చారని జీవీఎంసీ ఎన్నికల్లో  ఫ్యాన్ గుర్తుకి  ఓటేసి గెలిపించాలని  అప్పుడే యాదవ్ సామాజిక వర్గానికి  న్యాయం జరుగుతుందని తెలిపారు..