-----ఏపీలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ఏర్పాట్లు
-----విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో తన కొత్త రాజకీయ పార్టీ
------11వ నెల, 11వ తేదీన, 11 గంటల 11 నిమిషాలకు ముహూర్తం !
-----'11' నంబర్ సెంటిమెంట్ ను సాయిరెడ్డి ఫాలో అవుతున్నరా ?
( న్యూస్ వన్ బ్యూరో )
ఏపీలో మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ నవంబర్ నెలలో ఆవిర్భవించబోతోంది. నవంబర్ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడలో కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు ట్వీట్ చేశారు. తాము స్థాపించబోయే కొత్త పార్టీ జెన్ జీ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే 10 పాయింట్ల ఫార్ములా గురించి కూడా ట్వీట్ చేశారు.మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ప్రకటించారు. నవంబర్ నెలలో కొత్త పార్టీ జెండా, ఎజెండా ప్రకటించబోతున్నట్లు ట్వీట్ చేశారు. 'అమ్మవారి దీవెనలతో.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలే ఎజెండాగా రెండు పార్టీలు, రెండు కుటుంబాల దోపిడీకి ముగింపు పలికేలా, కులపిచ్చి మత పిచ్చి రాజకీయాలను తిరస్కరించేలా.. కరువు కాటకాలు కరెంటు కోతలు లేని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించేలా.. ప్రతి ఎకరానికి రెండు పంటలకు నీరు అందించేలా.. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ లభించేలా.. చదవుల భారం తగ్గించి 100శాతం యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పించేలా.. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయాలు పెరిగి ఖర్చులు తగ్గించేలా.. 80 ఏళ్లుగా నెరవేరని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా.. జెన్ జీ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా' కొత్త పార్టీని ఏర్పాటు చేస్తామన్నారు. 11వ నెల, 11వ తేదీన, 11 గంటల 11 నిమిషాలకు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో మనందరి కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం ఉంటుందని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సును కోరుకునేవారంతా మద్దతు పలకాలని విజయసాయిరెడ్డి కోరారు.
మన రాజకీయాల్లో తుంచాల్సిన 10 తలలు.. దశకంఠుడి తలల మాదిరిగా ఉన్న 10 అలవాట్లు అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. పని ప్రారంభం కాకముందే విజయం సాధించేశాం అని ప్రకటించటం.. అవినీతి సొమ్ము కోసమే రాజకీయం పార్టీలు నడపటం.. నాయకుడు చేస్తున్నది తప్పు అని తెలిసినా గుడ్డిగా సమర్థించటం.. యువతను భావి నిర్మాతలుగా కాకుండా, జేజేలు కొట్టే గుంపుగా చూడటం.. నిర్ణయాధికారం లేకుండా చేసి, మహిళల్ని ఓటు బ్యాంకుగా మార్చటం.. వాస్తవాల్ని దాచేసి తమ వల్ల గొప్ప ఫలితాలు వచ్చాయని చూపటం.. ఎన్నికల తర్వాత నాయకులు పత్తా లేకుండా పోవటం.. పార్టీల దృష్టి గెలుపు మీదే తప్ప, పరిపాలన మీద లేకపోవటం.. అయ్యే ఖర్చు ఎంతో చెప్పకుండా ఎన్నికల హామీలు ఇవ్వటం.. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అహంకారంతో శత్రువులుగా చూడటం అంటూ 10 పాయింట్లను ప్రస్తావించారు.విజయసాయిరెడ్డి కొత్త పార్టీని దసరా పండగ సమయంలో ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. అయితే పార్టీ ఆవిర్భావం కాస్త ఆలస్యమైంది. వైఎస్సార్సీపీనుంచి రాజ్యసభ ఎంపీగా పనిచేసిన విజయసాయిరెడ్డి గతేడాది రాజ్యసభ ఎంపీ పదవికి, వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు.. తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో మీడియా సమావేశాలు నిర్వహించి తన కొత్త పార్టీ గురించి వివరాలు వెల్లడించారు.
మొదటి వ్యాఖ్య రాయండి!