ఆలమూరు : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు మండల పరిషత్ కార్యాలయము వద్ద స్థానిక ఎంపీటీసీ ఎలక్షనన్ ల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బందోబస్తును పర్యవేక్షిస్తున్న అధికారులు తహసిల్దార్ కుశవరాజు. ఎండిఓ రాజు. సీఐ విద్యాసాగర్. ఎస్సై నరేష్. అడిషనల్ ఎస్సై సూర్యచంద్రరావు. సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ ఎలక్షన్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించకుండా ఎంపీటీసీ నామినేషన్ వేసే అభ్యర్థులు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అంతేకాకుండా ప్రజలకు గాని ప్రయాణికులకు గాని అసౌకర్యాలు కలిగించి ఎలక్షన్ నిబంధనలు ఉల్లంఘించకూడదని మద్యం డబ్బు బంగారం ఇటువంటి వస్తువులు తీసుకెళ్తున్నప్పుడు తనిఖీలలో భాగంగా తప్పనిసరి సంబంధిత పత్రాలు చూపించాలని లేనియెడల వాటిని సీజ్ చేస్తామని పోలీసుల తెలియజేశారు.