ఆలమూరు:విజయదశమి సందర్బంగా మండల కేంద్రం ఆలమూరులో మెయిన్ రోడ్ లో బస్టాండు సెంటర్ సమీపంలో ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు.విజయదశమి సందర్బంగా 
ఉదయం నుంచే ఆలయ అర్చకులు నరసింహాచార్యులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండి సాయిబాబాను దర్శించుకున్నారు.ఈ సందర్బంగా బాబా  ఆలయం వద్ద భారీ అన్నసమారాధన జరిగినది. ఈ అన్నసమారాధనకు సుమారు 800 మంది వరకు విచ్చేసి బాబా వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.ఈ అన్న సమారాధన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు అధ్యక్షతన అత్యంత ఘనంగా జరిగినది.ఈ సందర్భంగా డాక్టర్ చల్లా మాట్లాడుతూ షిరిడి సాయిబాబా ఎంతో మహిమ గల దేవుడని, షిరిడిలో ఉన్న బాబా విగ్రహం, ఆలమూరులో ఉన్న బాబా  విగ్రహం ఒకే విధంగా ఉంటాయని, దేశంలో ఈ రెండే విగ్రహాలు ఒకే రకంగా, ఒకే విధంగా ఉండటం ప్రత్యేకం అని ఆయన అన్నారు. అలాగే భక్తులు ఇచ్చిన విరాళాలతోనే ఈ భారీ అన్నసమారాధన విజయవంతంగా జరిగినదని, దీనికి సహకరించిన ప్రతీ ఒక్కరికి పేరుపేరున ఆలయకమిటీ తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నట్లు డాక్టర్ చల్లా అన్నారు. ఈ అన్నసమారాధన కార్యక్రమంలో ఆలయకమిటీ గౌరవ అధ్యక్షులు వంటిపల్లి పాపారావు కమిటీ సభ్యులు నార్కెడిమిల్లి వెంకన్నబాబు, రామానుజుల శేషగిరిరావు,చిలకమర్తి వాసు,ఎలుగుబంటి బూరయ్య,ఎలుగుబంటి సాయిబాబు,కాలా అప్పారావు,శిరిగినీడి పట్టాభి,పూల శివ,వెంపల సత్తిబాబు,తాకాసి ఏసు,చల్లా వెంకటేశ్వర్రావు, చల్లా సత్తిబాబు, చల్లా సూరిబాబు,కడియాల సాయిబాబు,తోరాటి శివ,తమ్మిరెడ్డి సత్యనారాయణ,సామంతుల నాని,వెత్సా శ్రీనివాస్, ఎరుకొండ గణేష్,నార్గని సెంథిల్ కుమార్,అనేక మంది భక్తజనులు తదితరులు పాల్గొన్నారు.