(న్యూస్ వన్ బ్యూరో )
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం ఈ భేటీలో ప్రధాన చర్చనీయాంశంగా ఉన్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చించి, ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే వ్యక్తిగత కారణాలతో జనసేన పార్టీకి చెందిన మంత్రులు కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదని పార్టీ వర్గలు చెబుతున్నాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఈ భేటీకి గైర్హాజరయ్యారు.రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికపై ఉత్కంఠస్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సమకాలీన సమాచారం, సామాజిక పరిస్థితులు, సంబంధిత జనాభా వివరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 19న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ మార్చి 23 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించిన కమిషన్ వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు, అభిప్రాయాలను సేకరించింది. దాదాపు ఏడు నెలలపాటు వివిధ స్థాయిల్లో అధ్యయనం నిర్వహించిన అనంతరం ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.. నివేదికలోని సిఫారసులు, వాటి ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వివరాల పరిశీలనబీసీ జనాభాకు సంబంధించి 1931 తర్వాత ప్రామాణికమైన కులాలవారీ జనాభా లెక్కలు అందుబాటులో లేని నేపథ్యంలో, ప్రభుత్వం నిర్వహించిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (UFS) వివరాలను కమిషన్ పరిశీలించింది.. అలాగే ఎస్సీ, ఎస్టీ జనాభాకు సంబంధించిన వివరాలు 2011 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయని పేర్కొన్నారు. సర్వే ద్వారా సేకరించిన వివరాలతో పాటు SGSW శాఖ వద్ద ఉన్న కులం, జనాభా వివరాలున్న కుటుంబ డేటాబేస్‌ను కూడా పరిశీలించినట్లు సమాచారం. గ్రామ, వార్డు స్థాయిలో ప్రజల ముందుకు వివరాలను తీసుకెళ్లి, తప్పులు లేదా లోపాలు ఉంటే వాటిని పరిశీలించి సరిదిద్దుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో బీసీ జనాభా 50.42 శాతం!కమిషన్ గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా 5,27,46,589గా ఉండగా, అందులో బీసీ జనాభా 2,65,94,418గా ఉన్నట్లు సమాచారం. అంటే రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 50.42 శాతంగా అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీ జనాభా 48.84 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 54.36 శాతంగా ఉన్నట్లు కమిషన్ గణాంకాల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.. ఈ గణాంకాలు బీసీ రిజర్వేషన్లపై చర్చలో ముఖ్యమైన అంశంగా మారాయి. అయితే, జనాభా శాతం ఒక్కటే స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్లను నిర్ణయించడానికి సరిపోదని, సంబంధిత చట్టపరమైన మార్గదర్శకాలు, ఇతర సామాజిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కీలక నిర్ణయంస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్టోబర్ 1న వెలువరించిన తీర్పులో కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల మొత్తం 50 శాతం పరిమితిని మించడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ప్రారంభించాలని కూడా ఆదేశించింది. దీనిపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.. ఈ నేపథ్యంలో మిశ్రా కమిషన్ నివేదిక, అందులోని సిఫారసులు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను ఎలా ఖరారు చేయాలన్న అంశాలపై కేబినెట్ చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.
మొదటి వ్యాఖ్య రాయండి!