----పార్టీలో చేరిన వారందరినీ పసుపు కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే బండారు
----స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతో రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ రాబోతోంది.
వాడపల్లి : కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. వాడపల్లి మాజీ ఎంపీటీసీ ఏపుగంటి వీరరాఘవుల తో సహా 50 కుటుంబాలకు చెందినవారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో శుక్రవారం వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ పసుపు కండువాలు కప్పి ఎమ్మెల్యే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన వెంటనే కోనసీమ తిరుమల వాడపల్లిలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో ఇంతమంది చేరడం స్వామివారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉన్నాయనడానికి నిదర్శనం అన్నారు. తొలిసారిగా శాసనసభ్యునిగా పోటీ చేసినప్పటి నుంచి ఏ ఎన్నిక జరిగిన మొదట వాడపల్లి వచ్చి స్వామి వారిని దర్శించుకుని ప్రచారం మొదలుపెట్టడం తనకు ఆనవాయితీ అని ఎమ్మెల్యే బండారు గుర్తుచేసుకున్నారు. వాడపల్లి మాజీ ఎంపీటీసీ వీరరాఘవులు వారి సహచర బృందం తెలుగుదేశంలో చేరడం చాలా సంతోషకరమన్నారు.ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ఆధ్వర్యంలో రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందన్నారు. మరలా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించడం ద్వారా త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడవాలని పట్టణాలను, గ్రామాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు మూడు ఇంజన్లుగా ఒకే మాట మీద ఒకే బాటలో పయనించినప్పుడు మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు సంక్షేమం అందించడానికి గ్రామాలను అభివృద్ధి చేయడానికి కూటమి అభ్యర్థులే గెలవాలని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీలు, వార్డు సభ్యులతో సహా అన్నింటా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 2029 లో సైతం ఎన్డీఏ కూటమే అధికారంలోకి తిరిగి రాబోతుందన్నారు. అందరూ కలిసి పనిచేసి ఎన్డీఏ కూటమి తరపున ఎవరికి అవకాశం ఇచ్చినా, ఎవరు పోటీ చేస్తున్నా అందరినీ గెలిపించుకోవాలని కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ,ముదునూరి వెంకటరాజు( గబ్బర్ సింగ్ ),కరుటూరి నరసింహారావు,కాయల జగన్నాధం,కూసుంపూడి రామకృష్ణరాజు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏపుగంటి వీర రాఘవులు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైసిపి నుంచి టిడిపిలో చేరిక
రాజకీయం
GANTA MADHU
ఒక గంట క్రితం
AI సారాంశం
----పార్టీలో చేరిన వారందరినీ పసుపు కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే బండారు ----స్థానిక
మొదటి వ్యాఖ్య రాయండి!