👇 ఫ్లెక్సీలు, వాల్ రాతలు👇
ప్రభుత్వ భవనాలు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు, వాల్ రాతలు ఉండరాదు.
ప్రలోభాలు:
ఓటర్లకు నగదు, మద్యం, బహుమతులు పంచడం లేదా ఉచితంగా వస్తువుల పంపిణీ చేయడం తీవ్ర నేరం.
మత/కుల ప్రచారాలు: కులాల, మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించేలా లేదా వ్యక్తిగత దూషణలతో ప్రసంగాలు చేయకూడదు. ప్రార్థనా మందిరాలను (గుడులు, మసీదులు, చర్చీలు) ప్రచార వేదికలుగా వాడరాదు.
ప్రభుత్వ వనరులు: అధికార పక్షం వారు ప్రభుత్వ వాహనాలు, నిధులు, భవనాలను లేదా ప్రభుత్వ పథకాల ప్రచారాలను ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు.
కొత్త పథకాలు/పనులు: ఓటర్లను ఆకట్టుకునేలా కొత్త ప్రభుత్వ పథకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లేదా కొత్త నిధుల మంజూరు చేయకూడదు.
అనుమతి లేని మైకులు:
రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మైకులు, లాడ్స్పీకర్లు వాడకూడదు. పగటిపూట కూడా ముందస్తు అనుమతి తప్పనిసరి.
నగదు రవాణా:
సరైన ఆధారాలు, పత్రాలు లేకుండా రూ. 50,000 కంటే ఎక్కువ నగదును రవాణా చేయకూడదు.
ఎన్నికల కోడ్: ఏం చేయకూడదు? ( చేయకూడనివి) 📢💭🔕
వ్యాపారం
STATE BEURO
58 నిమిషాల క్రితం
AI సారాంశం
👇 ఫ్లెక్సీలు, వాల్ రాతలు👇 ప్రభుత్వ భవనాలు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి రాజకీయ ఫ్ల
మొదటి వ్యాఖ్య రాయండి!