--------బీసీవై పార్టీ పతనానికి టైం దగ్గర పడింది.

--------కార్యకర్తలను బానిసలుగా చూస్తున్నారు.

--------"న్యూస్ వన్" తో ఆవేదన వ్యక్త చేసిన అల్లు.


విశాఖపట్నం : భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా అల్లు రమణారావు యాదవ్ విశాఖపట్నం జిల్లాలో పార్టీ స్థాపన నుండి నిర్విరామముగా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నాయకులగా తయారు చేస్తూ పార్టీని క్రమశిక్షణతో నడిపిస్తూ ఆంధ్ర ప్రదేశ్ లోనే బీసీవై పార్టీని విశాఖపట్నం జిల్లాలో ముందంజలో ఉంచినటువంటి వ్యక్తి అక్టోబర్ 17వ తారీఖున పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ఆయనకు బహుమతి పంపించడం జరిగిందని , ఆ యొక్క బహుమతిని తిరస్కరించినట్లు "న్యూస్ వన్" తో అల్లు రమణారావు వెల్లడించారు. తనను సస్పెండ్ చేసే దైర్యం ఎవరికీ లేదని,తన రాజకీయ జీవితం పై బురద జల్లితే సహించేది లేదని అయన స్పష్టం చేసారు.అయితే నా వివరణ అడగకుండా ఎందుకు సస్పెండ్ చేశారో కారణం కూడా కనుక్కోకుండా ఎవరో చెప్పిన మాటలు విని కుట్ర పూర్వకంగా పార్టీ ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది పన్నిన కుట్రలో అధిష్టానం తలవంగి సస్పెన్స్కు కారణమైంది.ఆ యొక్క సస్పెన్షన్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని పిఎన్ఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ శ్రీకృష్ణ యాదవ సంఘం అధికార ప్రతినిధి పల్లా నూకరాజుయాదవ్ డిమాండ్ చేయడం అయినది పార్టీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న తరుణంలో పార్టీ కేంద్ర కార్యాలయం తీసుకున్న నిర్ణయం బోడె రామచంద్ర యాదవ్ పూజలో ఉన్నాడని తెలుసుకొని ఆయనను మభ్యపెట్టి మైకుంలో పెట్టి అంతా నేనే అనుకుని ఆయన పక్కనే ఉంటూ పార్టీని అభివృద్ధి చెందకుండా నాశనానికి పూనుకుంటున్న వారిపై చర్యలు తీసుకోకపోగా ఇటువంటి చర్యలు తీసుకోవడం పార్టీ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న వారిపై సస్పెన్స్ వేటు వేయడం పార్టీ అభివృద్ధికి ఇది ఆటంకం భవిష్యత్తులో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గానీ జిల్లా కమిటీల సభ్యులు గాని పార్టీ నియమ నిబంధనలు ప్రకారం సస్పెండ్ చేయవలసి వస్తే ముందు పంపించవలసిన అవసరం ఉంది వారి వివరణ తీసుకొని వివరణతో సంతృప్తి చెందకపోతే అప్పుడు సస్పెన్స్ వేటు వేయాలి వెంటనే పార్టీ అభివృద్ధి దృష్ట్యా పార్టీలకు కొత్త వ్యక్తుల ప్రవేశించాలన్న పార్టీ ఒక విధివిధానాలు ముందుకు వెళ్లాలన్నా తక్షణమే బోడె రామచంద్ర యాదవ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వెనక్కి తీసుకొని ఆయనకు ఉన్నటువంటి పదవి రాష్ట్ర ఎగ్జిగుటి సభ్యుడుగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ,. ఆలస్యం చేయకుండా తక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయం నుండి సస్పెన్షన్ ఎత్తివేస్తూ అల్లు రమణా యాదవ్ యధావిధిగా కొనసాగించాలని కోరుతున్నాం బీసీవై పార్టీ మొండిగా వ్యవహరిస్తే పార్టీ పతనం తప్పదని అల్లు రమణారావు హెచ్చరించారు.