అమరావతి, అక్టోబరు 22: కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద భవానీ దీక్షలో ఉన్న నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి దర్శనం కోసం కాలినడకన వస్తున్న భవానీ భక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం అత్యంత బాధాకరమని సీఎం అన్నారు.  మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.