పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని స్థానిక సంస్థల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల జిల్లా పరిశీలకులుగా రోణంకి కూర్మనాథ్, ఐఏఎస్ నియామకం ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలపై పరిశీలకులను నేరుగా సంప్రదించవచ్చు ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు అనంతగిరి, అరకులోయ, పాడేరు ప్రాంతాల్లో పర్యటన అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక సంస్థల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల జిల్లా పరిశీలకులుగా రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ శ్రీ రోణంకి కూర్మనాథ్, ఐఏఎస్ నియమితులయ్యారు.ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఆయన నిన్న అనంతగిరి, అరకులోయ, పాడేరు ప్రాంతాల్లో పర్యటించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారుల సమన్వయం, ఎన్నికల నిబంధనల అమలు తదితర అంశాలను సమీక్షించారు.జిల్లా ఎన్నికల పరిశీలకులు శ్రీ రోణంకి కూర్మనాథ్, ఐఏఎస్ పాడేరులోని పీఎంఆర్సీ (PMRC) అతిథిగృహంలో బస చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు, అంటే 2026 డిసెంబర్ 3వ తేదీ వరకు జిల్లాలో అందుబాటులో ఉంటారు.


అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలకు సూచన : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలకు ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు, సమస్యలు లేదా అభ్యంతరాలు ఉంటే జిల్లా ఎన్నికల పరిశీలకులు శ్రీ రోణంకి కూర్మనాథ్, ఐఏఎస్‌ను నేరుగా సంప్రదించి తెలియజేయవచ్చు.ఇందుకోసం ముందుగా ఆయన క్యాంప్ క్లర్క్ (పర్యటన కార్యాలయ సహాయకుడు) ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి.ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలకుల దృష్టికి తీసుకువచ్చి, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సహకరించాలని అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలకు విజ్ఞప్తి చేయడమైనది.


సంప్రదింపు వివరాలు

జిల్లా ఎన్నికల పరిశీలకులు: రోణంకి కూర్మనాథ్, ఐఏఎస్

హోదా: రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్

మొబైల్ నంబర్: 7989108836

క్యాంప్ క్లర్క్ మొబైల్ నంబర్: 7848743786

కలిసే ప్రదేశం: పీఎంఆర్సీ (PMRC) అతిథిగృహం, పాడేరు

జిల్లాలో అందుబాటు: 2026 డిసెంబర్ 3వ తేదీ వరకు

కలిసే సమయం: ఉదయం 9 గంటలలోపు లేదా సాయంత్రం 6 గంటల తర్వాత