----గుమ్మ లక్ష్మిపురం జంక్షన్ చెక్‌పోస్టును తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి

పార్వతీపురం మన్యం జిల్లా : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు. ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు జిల్లాలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ఎఫ్‌ఎస్‌టీ, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలతో 24 గంటల నిఘా కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.ఈ సందర్భంగా అక్టోబర్ 22న గుమ్మలక్ష్మిపురం గ్రామం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టును ఎస్పీ తనిఖీ చేసి, విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెక్‌పోస్టు వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వాహనాల తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఇతర ప్రలోభపరిచే వస్తువుల రవాణాను అరికట్టేందుకు నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నియమావళి (MCC) అమలులో ఉన్న సమయంలో నిబంధనలను అనుగుణంగా నగదు, ఇతర వస్తువులు తీసుకెళ్ళే వారిదగ్గర వాటికీ తగ్గ అనుమతి పత్రాలును క్షుణ్ణంగా తనిఖీ చెయ్యాలని, తనిఖీల సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రతి వాహనాన్ని అప్రమత్తతతో పరిశీలించాలని తెలిపారు. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని, ఎన్నికల నియమావళి (MCC) ఉల్లంఘించిన, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించిన వారిపై కఠిన చర్యలు తీసికోవాలని లేదా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.ఈ తనిఖీలలో జిల్లా ఎస్పీతో పాటుగా ఎల్విన్పేట ఎస్సై శివప్రసాద్, చెక్ పోస్ట్ సిబ్బంది* పాల్గొన్నారు.