ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి టౌన్ అక్టోబర్ 23: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) సాధారణ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకుందని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణ:* జిల్లాలోని అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడమైనది. ఎవరూ ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు.
*స్వేచ్ఛగా నామినేషన్ల దాఖలు:* ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అర్హులైన అభ్యర్థులెవరైనా ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా, ప్రశాంత వాతావరణంలో వచ్చి నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
*రక్షణ కల్పన:* నామినేషన్ దాఖలు చేయకుండా ఎవరైనా బెదిరించినా, ఆటంకాలు లేదా అడ్డంకులు సృష్టించినా వెంటనే సంబంధిత స్థానిక పోలీసు అధికారులను లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి. అటువంటి వారికి తక్షణమే తగిన వ్యక్తిగత భద్రత కల్పించి, నామినేషన్ కేంద్రానికి తీసుకెళ్లి నిర్ణీత గడువులోగా సజావుగా నామినేషన్ వేసేలా చర్యలు చేపడతాము.
*చట్టపరమైన చర్యలు:* నామినేషన్ల దాఖలు ప్రక్రియకు ఎవరైనా ఆటంకం కలిగించినా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూసినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించడమైనది.ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు, అభ్యర్థులు పోలీసు యంత్రాంగానికి సహకరించాల్సిందిగా కోరడమైనది.
మొదటి వ్యాఖ్య రాయండి!