-----ఫార్మసిటీ స్టాప్ ఎండ్ వర్కర్స్ యూనియన్

పరవాడ :  ఫార్మసిటీలో అరవింద యూనిట్ 5లో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మసిటీ స్టాప్ ఎండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఐదున్నర గంటలకు జరిగిన ఈ ప్రమాదంపై ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఐ సో ప్రొఫైల్ ఆల్కహాల్ బ్యాచ్ బ్యాచ్ కి మధ్య క్లీన్ చేస్తున్న సందర్భంలో ఫైర్ జరిగిందని బి.పి కి ,షుగర్ కి మందులు తయారీ, మెట్ ఫర్ మెన్ మందులు తయారీ విభాగంలో జరిగింది. ప్రొడక్షన్ బ్లాక్ ఎక్స్టెన్షన్ ఏరియా తెల్లవారు అయిదున్నర ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేయడానికి లేకుండా దగ్గరగా నిర్మాణం జరిగినట్లు ఉంది. రాత్రి సి షిఫ్ట్ లో ఉన్న కార్మికుల లిస్ట్ బయట పెట్టాలని గని శెట్టి డిమాండ్ చేశారు. భద్రతా వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గని శెట్టి అన్నారు. ప్రమాదం పై సమగ్ర విచారణతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రత ఆడిట్ నిర్వహించాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. కార్మికులు క్షణక్షణం భయాందోళనలో అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఫార్మా పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తున్నట్లు గని శెట్టి తెలిపారు.