--------- మాజీ మంత్రి అమర్నాథ్ ని  మర్యాదపూర్వకంగా  కలిసిన గల్లా శివాజీ 



గాజువాక :  విశాఖ  జివిఎంసి 103వ వార్డు వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గల్లా శివాజీ మాజీ ఐటీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గల్లా శివాజీ మాట్లాడుతూ 103వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గుర్రం శ్రీనుని గెలిపించుకునే బాధ్యత మాది. దీనికి మీరు మరింత సపోర్ట్ చేయాలని, రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని బలపరచడానికి మీ వంతు సపోర్ట్ చేయాలని శివాజీ  అమర్నాథ్ ని కోరడం జరిగింది.అలాగే వార్డులోని యువత, విద్యార్థుల సమస్యలపై చర్చించి, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు.దీనిపై గుడివాడ అమర్నాథ్ గారు సానుకూలంగా స్పందిస్తూ, యువ నాయకులే పార్టీకి భవిష్యత్తు అని, గుర్రం శ్రీను గెలుపు కోసం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని తెలిపారు.