( న్యూస్ వన్ బ్యూరో )


విశాఖ బీసీవై పార్టీలో అంతర్గత కుమ్ములాటలు నేపథ్యంలో బీసీవై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు అల్లు రమణారావు యాదవ్ ను ఈ నెల అక్టోబర్ 17న కుట్ర పూర్వకంగా సస్పెండ్ చేసారని ఆయన "న్యూస్ వన్" ను ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో విశాఖ బీసీవై పార్టీలో జరుగుతున్నా కుమ్ములాటలు పై ఈ నెల 22 న నన్ను ఎవడురా సస్పెండ్ చేసేది అనే శీర్షికను "న్యూస్ వన్"లో ప్రచురణచడం జరిగింది.ఈ కధనం పై బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ గురువారం స్పందినచారు.విశాఖ బీసీవై పార్టీలో జరుగుతున్నా కుమ్ములాటలు పై అయన ఆరా తీశారు.అల్లు రమణారావు సస్పెండ్ తన దృష్టికి రాలేదని ఎవరో చేసారో తనిఖీ తెలియదని,దీనిపై సమగ్ర విచారణ జరుపుతానని ఆయన వెల్లడించారు.అల్లు రమణ యాదవ్ పై సస్పెన్షన్ ఎత్తి వేయడంతో పాటు ఆయనకు యధావిధిగా కొనసాగించాలని జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆదేశించడం జరిగినదని చాలా గొప్ప విషయం. ఆనందపడ వలసిన విషయంని, నిజమైన కార్యకర్తలకు న్యాయం జరిగేల మన ఆర్సివై చూస్తారని చెప్పడానికి ఇదో ఒక నిదర్శనంగా చెప్పొచ్చు జూపల్లి రాములు యాదవ్ "న్యూస్ వన్" తో అన్నారు.ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం జూపల్లి రాములు యాదవ్ "న్యూస్ వన్" ప్రతినిధితో మాట్లాడుతూ అన్యాయంగా అక్రమార్గంలో తనని తొలగించారని అన్నారు.కార్యకర్తలకు తాను ఎప్పుడు అండగా ఉంటానని బోడె రామచంద్ర యాదవ్ మరోసారి కార్యకర్తలకు భరోసా ఇచ్చారని అన్నారు.జూపల్లి రాములు యాదవ్ ను తిరిగి పార్టీలోకి తీసుకోవడంతో


బీసీవై పార్టీ గాజువాక నియోజకవర్గం కార్యాలయం వంటిల్లు జంక్షన్ నందు గాజువాక నియోజకవర్గం కో కన్వీనర్ మరియు 87 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పల్లా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.అనంతరం అల్లు చేత కేక్ కట్ చేయించారు.ఈ సందర్భంగా పల్లా వెంకట అప్పారావు మాట్లాడుతూ బీసీవై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు అల్లు రమణారావు యాదవ్ అక్టోబర్ 17వ తేదీన కుట్ర పూర్వకంగా సస్పెండ్ చేయడం జరిగిందిని అన్నారు.పార్టీ కోసం నిర్మాణం కోసం అభివృద్ధి కోసం విశాఖపట్నం జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లా మరియు పార్వతిపురం జిల్లా పార్టీ అభివృద్ధి చేయడంలో ఆయన యొక్క కృషి మరువలేనిది ఉత్తరాంధ్రలోనే పార్టీ అభివృద్ధికి ఆయన కృషి ఉన్నదన్నది గుర్తించవలసిందే ఆంధ్రప్రదేశ్ లోనే బీసీవై పార్టీ అభివృద్ధిలో విశాఖపట్నం జిల్లాను ముందంజలో ఉంచిన వ్యక్తి అటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం పార్టీకి మంచిది కాదని ఆయన సస్పెన్స్ ని ఎత్తకపోతే కార్పొరేటర్ గా పోటీ చేసిన వారందరము పార్టీకి దూరమవుతావని గ్రేటర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేట్ అభ్యర్థుల అందరము ఆయనకు మద్దతుగా కేంద్ర కమిటీకి తెలియజేయడం జరిగింది

మా యొక్క విన్నపమును మన్నించి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ పార్టీలో జరుగుతున్న తప్పుడు నిర్ణయాలను అందుకు బాధ్యులను చర్యలు తీసుకొని తిరిగి క్రమశిక్షణతో పార్టీని నడిపిస్తూ మాకందరికీ ఆదర్శంగా నిలుస్తున్న శ్రీ అల్లు రమణారావు యాదవ్ను యధావిధిగా కొనసాగిస్తూ ఆయన యొక్క సస్పెన్షన్ అక్టోబర్ 22వ తారీఖున ఎత్తివేస్తున్నట్లు ప్రకటన జారీ చేయడం హర్షదాయకం అన్నారు.

అందుకు అభినందనలుగా పార్టీ అభివృద్ధి చెందడం కోసం ఆయన యొక్క గౌరవాన్ని పెంచాలని ఆయన యొక్క కృషిని గుర్తు చేస్తూ చిరు సత్కారం పూలమాలతో అభినందిస్తూ కేక్ కట్ చేస్తూ కృతజ్ఞతలు తెలపడం జరిగినదని అన్నారు. ఆ యొక్క కార్యక్రమంలో 93 వ వార్డు కార్పొరేట్ అభ్యర్థి శ్రీ పాలశెట్టి మలక్ష్మి నాయుడు 98 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కానూరు వెంకట సత్యనారాయణ 88 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కోమటి ప్రసాద్ 106 వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి కాసారపు వెంకటలక్ష్మి 82 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సాగి జగదీశ్వరి 78 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సర్వసిద్ధి జగదీశ్వరి 76 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అక్కడ రమణ ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి అల్లు రమణారావు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తే పార్టీ మిమ్మల్ని గుర్తిస్తాది మీకు ఎటువంటి రక్షణకైనా పార్టీ ముందు ఉంటదని కష్టపడే వాళ్ళకి పార్టీలో సముషిత స్థానం కల్పించడంలో పార్టీ ముందుంటాది అందుకు ఉదాహరణ నేనే కాబట్టి పార్టీ కార్యకర్తలు అభిమానులు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ పార్టీ అభ్యర్థులు మేయర్ అండ్ కార్పొరేటర్లు టార్చ్ లైట్ గుర్తుపై పోటీ చేయుచున్నారు కనుక ఆ గుర్తుపై ఓటు వేసేటట్లు మనమందరము గ్రామాల వారీగా పర్యటించి ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఓటును నోటుతో అమ్ముకోకుండా ప్రశ్నించే వాళ్లకి మీరు ఓటు వేయండి వాడవాడలా ప్రచారం చేస్తున్నట్లు తేలిపారు .