- ఎస్పీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్

విజయనగరం జిల్లా  : విజయనగరం పట్టణంలో జరగనున్న శ్రీ పైడితల్లమ్మ పండగ, ప్రాదేశిక ఎన్నికలను ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ అక్టోబర్ 23న విజయనగరం 1వ పట్టణ పీఎస్ నుండి గంట స్తంభం, మూడు లాంతర్లు, కోట జంక్షన్, లైన్స్ క్లబ్ జంక్షన్ మీదుగా బాలాజీ జంక్షన్, జొన్నగుడ్డి వరకు పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. జిల్లా ఎస్పీ  ఎఆర్ దామోదర్,  కవాతులో స్వయంగా పాల్గొని, ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేయాలను, బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగవద్దని, పోలీసుశాఖ అండగా ఉంటుందని ప్రజలకు భరోసా కల్పించారు.