----జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్*

*అనకాపల్లి అక్టోబర్ 23: అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి మున్సిపాలిటీ మరియు నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు మొదట ఈ నెల 28వ తేదీన జరగాల్సి ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (AP State Election Commission) ఉత్తర్వుల ప్రకారం ఆ ఎన్నికలను వాయిదా వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు.సవరించిన షెడ్యూల్ ప్రకారం, పోలింగ్ ప్రక్రియ నవంబర్ 1వ తేదీన నిర్వహించబడుతుందని, అవసరమైతే రీపోలింగ్ నవంబర్ రెండవ తేదీన నిర్వహిస్తామని,  ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియ నవంబర్ 3వ తేదీన జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

జారీ:  డివిజనల్ పౌర సంబంధాల అధికారి, అనకాపల్లి