---ఢిల్లీ పోలీసులు, ప్రధాని మోడీకి మద్దతుగా నినాదాలు
న్యూ ఢిల్లీ ; ఢిల్లీలో శనివారం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు విమానం నుంచే అరెస్ట్ చేశారు. ఇప్పటికే 2000లకు పైగా నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీకి మద్దతుగా నిలుస్తున్న యూట్యూబర్ ధ్రువ్ రాఠీని, సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీకి వ్యతిరేకంగా, ఢిల్లీ పోలీసులకు మద్దతుగా మరో నిరసన మొదలైంది. కన్నాట్‌ప్లేస్ సమీపంలో పెద్ద సంఖ్యలో యువత పోస్టర్లు, బ్యానర్లు పట్టుకుని అక్కడికి చేరారు. సీజేపీకి వ్యతిరేకంగా, ప్రధాని నరేంద్రమోడీ, ఢిల్లీ పోలీసులకు మద్దతు తెలిపే పోస్టర్లను ప్రదర్శించారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, తామంతా దేశభక్తులమని నిరసన తెలిపేందుకు వచ్చామని చెబుతున్నారు. కొన్ని పోస్టర్లలో ఈవీఎం ఫోటోలు కూడా ఉన్నాయి. ప్రదర్శనలో పాల్గొన్న వారు సీజేపీ నిరసన ఒక కుట్ర అని, దీని వెనక అమెరికా ఉందని ఆరోపించారు. గత నిరసనల్లో వారు ఉగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేశారని, ఇప్పుడు వారికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు తాము వచ్చామని చెబుతున్నారు..
సీజేపీకి వ్యతిరేకంగా ..ఢిల్లీలో మరో నిరసన
నేరాలు-ఘోరాలు
SWETHA SINGH
2 గంటల క్రితం
AI సారాంశం
---ఢిల్లీ పోలీసులు, ప్రధాని మోడీకి మద్దతుగా నినాదాలు న్యూ ఢిల్లీ ; ఢిల్లీలో శనివారం కాక్రోచ్ జనతా ప
మొదటి వ్యాఖ్య రాయండి!