అబ్దుల్ కలాం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం: చంద్రబాబు
వ్యాపారం
CHANDU
ఒక గంట క్రితం
AI సారాంశం
అమరావతి: దేశ అణు, సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం చేసిన దార్శనికుడు.. కోట్లాది మందికి స్ఫూర్త
అమరావతి: దేశ అణు, సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం చేసిన దార్శనికుడు.. కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కొనియాడారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. అరుదైన వ్యక్తిత్వం, మానవతా దృక్పథం కలిగిన కలాం దేశానికి, సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని చంద్రబాబు అన్నారు. ‘‘అబ్దుల్ కలాం అంటే ఒక స్ఫూర్తి శిఖరం. అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. దేశ అణు, సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశనం చేసిన దార్శనికుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఆయన జయంతి సందర్భంగా ఆ మానవతావాది దేశ, సమాజ సేవలను స్మరించుకుందాం’’అని ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
మొదటి వ్యాఖ్య రాయండి!