జలసంధిలో కుప్పలు కుప్పలుగా ఐఫోన్లు!
వ్యాపారం
RITA
ఒక గంట క్రితం
AI సారాంశం
హర్మూజ్ :అంతర్జాతీయ నౌకా రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 2,500 కం
హర్మూజ్ :అంతర్జాతీయ నౌకా రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 2,500 కంటైనర్ల సరకుతో ప్రయాణిస్తున్న సింగపూర్ జెండా కలిగిన ‘జీఎఎఫ్ఎస్ ప్రైడ్’ అనే కార్గో నౌక సముద్రంలో మైన్ను ఢీకొని నీట మునిగిపోయింది. ఈ ఘటనను ఇరాన్ విప్లవాత్మక బలగాలు ( అధికారికంగా ధృవీకరించాయి. మైన్ను ఢీకొట్టడం వల్ల నౌక మునిగిపోయిందని ఐఆర్జీసీ ప్రకటించడం ఇదే తొలిసారి కావడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.చట్టవిరుద్ధమైన, అత్యంత ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఇరాన్ స్థానిక మీడియా, అధికారులు వెల్లడించారు.దుబాయ్ నుంచి బయలుదేరిన ఈ నౌకలో ఐఫోన్లు, విలాసవంతమైన లగ్జరీ పెర్ఫ్యూమ్లు సహా ఇతర ఖరీదైన వస్తువులు ఉన్నాయి. ప్రమాదం ధాటికి కంటైనర్లు సముద్రంలో చెల్లాచెదురై, ఐఫోన్ల పెట్టెలు నీటిపై తేలియాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి.హర్మూజ్ మార్గంలో సింగపూర్కు చెందిన రెండు నౌకలు ప్రమాదానికి గురైనప్పటికీ, అందులో మునిగిపోయిన నౌకలోని సిబ్బందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తరలించాయని సింగపూర్ పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.
మొదటి వ్యాఖ్య రాయండి!