👉  సన్నద్ధత పై సమీక్షించిన సంయుక్త కలెక్టర్ జి. విద్యాధరి

విశాఖపట్నం, అక్టోబరు 16:  ఎం.పి.టి.సి, జెడ్. పి.టి.సి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఈ నెల 21వ తేదీ నుండి స్వీకరించడం జరుగుతుందని, ఎన్నికలు నవంబర్ 3న, ఓట్ల లెక్కింపు 5వ తేదీన జరుగుతాయని సంయుక్త కలెక్టర్ జి.విద్యాధరి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో ఏర్పాట్లు పై జేసీ సమీక్షించారు. సజావుగా  ఎన్నికల నిర్వహించుటకు గానూ నోడల్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. డివిజనల్ స్థాయి లో ఆర్.డి. ఓ లు ఇంచార్జ్ లుగా వుంటారని, అసిస్టెంట్ అథారిటీ గా ఎం.పి.డి. ఓ లు వ్యవహరిస్తారని తెలిపారు.  203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడమైందని, ప్రతి  పోలింగ్ స్టేషన్ వద్ద కనీస వసతులు ఉండేలా పంచాయతీ రాజ్ ఎస్.ఈ  చూడాలనిసూచించారు.  మోడల్ కోడ్ వెంటనే అమలులోకి వస్తుందని తెలిపారు. పార్టీల ప్రతినిధుల ఫోటోలు, ఫ్లెక్సీలు తొలగించాలని, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాలని తెలిపారు.  ఎన్నికల సామాగ్రిని, పోలింగ్ అధికారులను సిబ్బందిని నియమించడం జరిగిందని, వారికి శిక్షణలు కూడా వెంటనే ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల విధులలో స్వంత తెలివితేటలను వాడకూడదని, పనులన్నీ  ఇచ్చిన  గడువులోగానే పూర్తి చెయ్యాలని ఆదేశించారు. 
ఈ సమావేశంలో  జిల్లా పరిషత్ సి.ఈ. ఓ నారాయణమూర్తి, డిప్యూటీ సి.ఈ. ఓ సందీప్, ఆర్.డి. ఓ దిలీప్ చక్రవర్తి, డి.ఈ. ఓ ప్రేమ్ కుమార్, పూర్ణిమ, తదితరులు పాల్గొన్నారు.