*మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి*
-----జీవీఎంసీ కూటమి కార్పొరేట్ అభ్యర్థులతో మంత్రి సమావేశం
విశాఖపట్నం , అక్టోబర్ 22 :జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ప్రతి అభ్యర్థి కష్టపడి పని చేయాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం విశాఖ డాల్ఫిన్ హాటల్ లో జీవీఎంసీ కూటమి కార్పొరేట్ అభ్యర్థులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, ప్రజలతో మమేకమవడం వంటి అంశాలపై అభ్యర్థులకు మంత్రి పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. టిక్కెట్లు ఆశించి పొందలేని వారిని సమన్వయంతో కలుపుకొని పనిచేయాలన్నారు. వైసీపీ అభ్యర్థుల కంటే కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. కూటమి రెండున్నరేళ్ల పాలనలోనే విశాఖ నగరానికి పెద్ద ఎత్తున కంపెనీలు, పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. వైసీపీ హయాంలో విశాఖ నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, కూటమి పాలనలో నగరంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రజలంతా కూటమి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి అభ్యర్థి కష్టపడి పని చేసి జీవీఎంసీపై కూటమి జెండా ఎగురవేయాలని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ భరత్ , ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు చోడే పట్టాభిరామ్ , జీవీఎంసీ ఎన్నికల పరిశీలకులు ఎంఏ షరీఫ్, కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
మొదటి వ్యాఖ్య రాయండి!