ఏళ్ళు గడుస్తున్నాయి...తారలు మారుతున్నాయి...అయినా వీళ్ళు మారారా ?...వీళ్ళలో మార్పు రాదా ? బ్రతికినంత కాలం ... ఈ వర్గ పోరు తప్పదా ? ఇది ఈ సామాజిక వర్గనికి ఓ పెద్ద శాపమా ? పెద్దలు ...గెద్దలు మాదిరి తన్నకుంటుంటే...తోటి పిల్లలు సంగతి ఏంటి ? అధ్యక్ష పదివికి మోక్షం ఇంకా రాదా ? ఈ ముసలంకు ముగింపు పలికే నాధుడే లేడా ? ఎప్పుడు తన్నుకోవాల్సిందేనా ? పట్టించోకోవాల్సిన నాయుకులు దిష్టి బొమ్మల మాదిరి చూస్తూ ఉన్నారా ? ఈ వరగ్గా పోరుతో ఈ సామాజిక వర్గం చట్రలు కింద నలిగిపోవడమేనా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
( న్యూస్ వన్ బ్యూరో )
విశాఖపట్నం జిల్లా యాదవ సంక్షేమ సంఘంలో మళ్లీ ముసలం మొదలైంది...ఆదిపత్యం కోసం...తమ బలప్రదర్శనను చూపించే సమయం ఆసన్నమైందిని ...యాదవ్ పెద్దలు వారి బలాన్ని చూపించేందుకు వేదికలు సిద్ధంచేస్తున్నారని....ఏళ్లనాటి వర్గా పోరుకు రాధాకృష్ణ మహోత్సవాలు వేదిక కానున్నాయిని స్పష్టంగా తెలుస్తుంది...ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా విశాఖపట్నం జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాధాకృష్ణ మహోత్సవములు జరుపుకోవాలని యాదవులు నిర్ణయించకున్నారు...మళ్లీ ప్రతి ఏటా మాధిరిగా రెండు గ్రూపులు విడివిడిగా రాధాకృష్ణ మహోత్సవ్లు కరపత్రలను ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు ప్రచురించుకున్నారు..అంత షరా మామూలే అన్నట్టు ఉన్నది రాధాకృష్ణ మహోత్సవాలు...పట్టించుకోవాల్సిన ఎమ్మెల్యేలు విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘన్ని గాలికి వదిలేసారు...ఏళ్ళు గడుస్తున్నా రెండు గ్రూపులకు సయోధ్య కలిగించే నాయుడే లేకపోవడం యాదవ్ లకు సిగ్గుచేటనే చెప్పాలి...
విశాఖపట్నం జిల్లాలో యాదవ సంక్షేమ సంఘమును స్థాపించిన దగ్గర నుంచి కొన్ని దశాబ్దాలుగా రెండు వర్గాలుగా విడిపోయి కార్తీక పౌర్ణమి రోజున రాధాకృష్ణ మహోత్సవములు జరుపుకోవడం మనకందరికీ విధితమే గత సంవత్సరం 2025 నవంబర్ 11 వ తారీఖున రామకృష్ణ బీచ్ నందు రాధాకృష్ణ మహోత్సవములు ఒక వర్గం జిల్లా అధ్యక్షులుగా అక్కరమాని వెంకట్రావు ,మరొక వర్గం జిల్లా అధ్యక్షులుగా ఒమ్మి సన్యాసిరావు ఇరువురు వేరువేరుగా స్టేజీలు ఏర్పాటు చేసుకొని కార్యక్రమం చేయడం మన అందరికీ విధితమే...
ఈ ఏడాది నవంబర్ 24న రాధాకృష్ణ మహోత్సవములు జరుపనున్నామని నవంబర్ ఐదున ఒక వర్గం అధ్యక్షుడు హోదాలో అక్కరమాని వెంకట్రావు నాయకత్వములో సంపత్ వినాయక గుడి వద్ద ఇన్విటేషన్ కరపత్రం ఆవిష్కరించారు.మరొక వర్గం అధ్యక్షడు హోదాలో ఒమ్మి సన్యాసిరావు నవంబర్ 6న అదే సంపత్ వినాయక గుడి వద్ద ఇన్విటేషన్ కరపత్రం ఆవిష్కరించడం జరిగింది.కార్యక్రమాలు నిరవహించడం వరుకు అంత బాగానే ఉంది కానీ అసలు చిక్కు ఇక్కడే వస్తుంది...విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘంకు నేటి వరుకు అసలైన అధ్యక్షులు ఎవరు ?అన్నది స్పష్టంగా ఎవరికీ తెలియటంలేదు...? ఎవరి రాజకీయ స్వప్రయోజనాలకు వారు విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ను తాకట్టు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని తోటి యాదవులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.దీనివల్ల సమాజంలో యాదవ్ సమాజిక వర్గం మిగతా సామాజిక కులాలు వద్ద హీనా పరిస్థతిని ఎదురుకోవాల్సిన దుస్థితి దాపరించ్చినదని తోటి యాదవులు అభిప్రాయపడుతున్నారు. వీళ్ళిద్దరూ వేరువేరుగా కార్యక్రమాలు చేపట్టుకొని యాదవ సంఘమును రాజకీయ పార్టీలలో చులకన చేస్తున్నారు.దీనివలన యాదవుల రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మరుతున్నాదని యాదవులు పేర్కొంటున్నారు.తోటి కులాలు మధ్య హీనం అవుతున్నామని చెప్పిన ఫలితం మాత్రం సూన్యమంనే చెప్పాలి..
విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు యాదవ శాసనసభ్యులు నాయకత్వం వహిస్తున్నారు అందులో ఒకరు గాజువాక నియోజవర్గ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు, మరొక శాసనసభ్యులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ దక్షిణ నియోజకవర్గం ఇరువురు ఎన్నికవ్వడం యాదవులందరూ గర్వివించదగ్గ విష్యం అయినప్పటికీ విశాఖపట్నం జిల్లా యాదవ సంక్షేమ సంఘం విషయంలో వీరి అలసత్వం చాల స్పష్టంగా కొట్టించినట్లు కనిపిస్తుంది. వీరి యొక్క నాయకత్వం బలపరుచుకోవాలని ఆయా రాజకీయ పార్టీలలో వారు ప్రాతినిధ్యం ఉండేటట్లు చూసుకుంటూ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా అణగ త్రొక్కాలని కుట్రతో వర్గ పోరును పెంచి పోషిస్తున్నారన్న ఆరోపనులు గట్టిగ్గా వినిపిస్తున్నాయి.వర్గపోరుతో తోటి యాదవులు అందరు నలిగిపోతున్న వీళ్లకు మాత్రం దున్నపోతు మీద వాన పడిన చందంగానే ఉంటున్నారు తప్ప ఇరు వర్గలు మధ్య రాజి కుదరిచే సాహసం చేయకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి..విశాఖ జిల్లా యాదవ సంఘంకు నేను అధ్యక్షుడిని అంటే, నేను అని ఎవరికీ వారు తప్పుడు ప్రకటనలు జారీ చేస్తూ యాదవ్‌లను గందరగోళ పరిస్థితిలోకి నెట్టేస్తున్నారు. దీవిలన యాదవుల రాజకీయ భవిష్యత్తును సమాధి చేస్తున్నారన్న విషయం తెలిసినప్పటికీ ఎవరి స్వర్ద్దమ్ కోసం వారు తోటి యాదవులను కీలు బొమ్మలను చేసి ఆడిస్తున్నారన్నది తేటతెల్లం అవుతుంది.ఎవరి మనుగడ కోసం యాదవులను వారు బలిపశువులుగా సాటి యాదవులు మార్చడం శోచనీయమని చెప్పాలి..ఇద్దరిలో ఎవరో ఒకరు అధ్యక్ష పదివి నుండి తప్పుకొని విజ్ణతను ప్రదర్శిస్తే యాదవ జాతి మనుగడకు మేలు చేసే వాళ్ళు అవతారని సాటి యాదవులు ఇరు వర్గలకు హితవు పలుకుతున్నారు...
వీళ్ళు మారారు...పట్టించుకోరు...
వార్తలు
BEURO
59 నిమిషాల క్రితం
AI సారాంశం
ఏళ్ళు గడుస్తున్నాయి...తారలు మారుతున్నాయి...అయినా వీళ్ళు మారారా ?...వీళ్ళలో మార్పు రాదా ? బ్రతికినంత
మొదటి వ్యాఖ్య రాయండి!