రెడ్డిగూడెం ఎంపీపీగా ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి
వార్తలు
PRASAD B
2 గంటల క్రితం
AI సారాంశం
ఎంఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు విద్యా సహకారం.. ప్రజలకు నిరంతరం అండగా నిలుస్తూ రాజకీయ ప్రస్థా
ఎంఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు విద్యా సహకారం.. ప్రజలకు నిరంతరం అండగా నిలుస్తూ రాజకీయ ప్రస్థానం
రెడ్డిగూడెం: నవంబర్ 11 న్యూస్ వన్ ప్రతినిధి. ప్రజాసేవే పరమావధిగా, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి రెడ్డిగూడెం మండల పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారు.ఎంఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు విద్యాపరమైన సహాయ సహకారాలు అందిస్తూ, స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం ద్వారా విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తున్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో విద్యా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అలాగే పిల్లలకు నుండి వృద్ధుల వరకు కంటి చూపు కోసం క్యాంపులో నిర్వహిస్తూ ప్రజల హృదయాల్లో మంచి నాయకుడిగా గుర్తింపు పొందుతూఅదేవిధంగా మండలంలోని ప్రజలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ, సామాజిక సేవలో ముందుంటూ ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవా కార్యక్రమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.రెడ్డిగూడెం మండలంలో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి ఎంపీపీగా ఎన్నికైన ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి, మండల అభివృద్ధితో పాటు విద్యా, సామాజిక రంగాల్లో మరింత సేవలందించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
మొదటి వ్యాఖ్య రాయండి!