భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం
వార్తలు
GANATA MADHU
2 గంటల క్రితం
AI సారాంశం
అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.. కొత్తపేట :
అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు..
కొత్తపేట : భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. బుధవారం ఆయన జయంతి సందర్భంగా వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశపు తొలి విద్యా శాఖామంత్రిగా దేశంలో విద్యారంగ అభివృద్ధికి అబుల్ కలాం ఆజాద్ పునాదులు వేసారన్నారు. ఆయన దూరదృష్టి ఫలితంగా భారతదేశంలో విద్యాభివృద్ధి నేడు ఇంత ఉన్నత స్థాయికి చేరిందని కొనియాడారు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందడుగు వేయాలని సూచించారు.
మొదటి వ్యాఖ్య రాయండి!