-- దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకట్రావు వెల్లడి.
-- ​ఈ నెల 11న రాజగోపురం ప్రాంగణంలో సామూహిక సూర్యనమస్కారాలు
-- ​‘ఓమ్ ఫ్రీ యోగా సెంటర్’ సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు
-- ​భక్తులు, యోగసాధకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈవో పిలుపు

​సింహాచలం:10  అక్టోబర్ 2026 

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులతో సింహగిరిపై సామూహిక సూర్యనమస్కారాల మహాయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు.ప్రముఖ ‘ఓమ్ (AUM) ఫ్రీ యోగా సెంటర్’ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ (ఆదివారం) ఉదయం 5:30 గంటల నుంచి 7:00 గంటల వరకు రాజగోపురం ఎదుట పవిత్ర వాతావరణంలో 108 రౌండ్ల సూర్యనమస్కారాల ప్రదర్శన జరగనుందని ఆయన పేర్కొన్నారు.​ఈ సందర్భంగా ఈవో జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో యోగా సాధన చేయడం వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, సానుకూల దృక్పథం పెంపొందుతాయని తెలిపారు. అరసవల్లి, కోణార్క్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో సూర్యనమస్కారాలు నిర్వహించి, వరల్డ్ రికార్డు సాధించిన ‘ఓమ్ ఫ్రీ యోగా’ వ్యవస్థాపకులు డాక్టర్ చిలుకా వెంకటరమేష్ శిక్షణలో సుమారు 300 మందికి పైగా సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వివరించారు.

​భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు ఆరోగ్య స్పృహను కలిగించేందుకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దేవస్థానం సిబ్బందితో పాటు భక్తులు, యోగాభిమానులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈవో పిలుపునిచ్చారు.ఆదివారం,ఉదయం 5:30 గంటల నుంచి 7:00 గంటల వరకు,రాజగోపురం ప్రాంగణం, లో తెల్లటి టీ-షర్ట్ నల్లటి ప్యాంట్ తో​,యోగాపై ఆసక్తి ఉన్న భక్తులు, సాధకులందరూ పాల్గొనవచ్చునని ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు