--- కుటుంబసభ్యులుతో మాట్లాడిన సీఎం చందరబాబు నాయుడు


కాకినాడ జిల్లా : మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు వైద్యులు, యనమల కుటుంబసభ్యులు మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యంపై సమాచారం ఇవ్వాలని పార్టీ నేతల్ని ఆదేశించారు. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ ఆస్పత్రికి చేరుకుని యనమల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఆయన అనారోగ్య సమస్యలతో అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యు్లు వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణుడిని పరీక్షించిన డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. యనమల అస్వస్థకు గురయ్యారని తెలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ఆస్పత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి యనమల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. చంద్రబాబు రామకృష్ణుడి కుటుంబసభ్యులతో కూడా మాట్లాడారు.ఇటు రాజ్యసభ ఎంపీ సానా సతీష్ కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు.. అక్కడ యనమల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. యనమల అస్వస్థతకు గురికావడంతో ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారు.. కొంతమంది ఆస్పత్రి వద్దకు వచ్చారు. యనమల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన చేయాల్సి ఉంది.యనమల రామకృష్ణుడు 1983లో తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ తొలి మంత్రివర్గంలో న్యాయ, పురపాలక శాఖ బాధ్యతలు నిర్వహించారు. ఆయన 1985 1989 మధ్య మంత్రిగా.. 1989 నుంచి 1994 వరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. 1995 నుంచి 1999 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. ఆయన 1999 నుంచి 2003 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2008 మధ్య కాలంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. 2009 ఎన్నికల్లో ఆయన తుని నుంచి పోటీచేసి ఓడిపోయారు.. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యారు.2014 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత యనమల ఏపీ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు పోటీ చేయలేదు.. మళ్లీ ఆయన సోదరుడు కృష్ణుడు పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య టీడీపీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. యనమల టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు.