తిరుమల, 2026 అక్టోబరు 2022 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున శ్రీవారి దర్శనం, వసతి కోసం తిరుమలలో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం, వసతి కల్పించడం జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ( ఎన్నికల ప్రవర్తనా నియమావళి ) ఉన్నంత వరకు ఇది వర్తిస్తుంది కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.