రెడ్డిగూడెం: రెడ్డిగూడెం మండల పరిషత్ పరిధిలోని రెడ్డిగూడెం 1వ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బొమ్మిన కోటేశ్వరరావు, రంగాపురం 2వ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ముప్పిడి నాగేశ్వరరెడ్డి, రెడ్డిగూడెం రెడ్డు సెగ్మెంట్ ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి మల్లాది జగదీష్ భార్య సౌందర్య కుమారి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు విజయబాబు మండల పార్టీ అధ్యక్షులు జలపాటి వేణుగోపాల్ రెడ్డి. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చాపలమడుగు తాతారావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అభ్యర్థుల గురించి స్థానికంగా చర్చ జరుగుతోంది. బొమ్మిన కోటేశ్వరరావు, ముప్పిడి నాగేశ్వరరెడ్డి గత కొంతకాలంగా పేదలు, బడుగు బలహీన వర్గాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని వారి అనుచరులు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, అవసరమైన వారికి సాయం చేస్తూ స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

వీరిద్దరూ విద్యావంతులుగా, విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్యా దాన కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసినట్లు వివరించారు.

గ్రామాల అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని వారు భావిస్తున్నట్లు వారి అనుచరులు తెలిపారు. రెడ్డిగూడెం మండలం మొత్తం మీద 59 మంది ఆ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు వారి నామినేషన్ దాఖలు చేసినారు.