ఉత్తరాఖండ్‌: శీతాకాలం నేపథ్యంలో ప్రముఖ శైవ క్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు బుధవారం ఉదయం 8.30 గంటలకు మూసుకున్నాయి. అంతకుముందే అధికారులు, పూజారులు సంప్రదాయ పద్ధతిలో గర్భాలయం, దక్షిణ ద్వారం మూసివేశారు. అనంతరం పంచముఖి డోలీలో కేదార్‌నాథుడిని తూర్పు ద్వారం నుంచి బయటకు తీసుకొచ్చి ద్వారాలను మూసివేశారు. ఈ మహాక్రతువులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. స్వామివారి ప్రతిమను ఉఖీమఠ్‌కు తరలించి 6 నెలల పాటు అక్కడే పూజలు నిర్వహిస్తారు.