రాప్తాడు నిందితుడి కాలు భద్రపరచండి : ఏపీ హైకోర్టు
నేరాలు-ఘోరాలు
KIRAN BABU
3 గంటల క్రితం
AI సారాంశం
విజయవాడ : రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై దాడి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ
విజయవాడ :
రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై దాడి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడైన హేమంత్ (21)కు సర్జరీ ద్వారా తొలగించిన అతని కుడి కాలును సేఫ్‌గా ఉంచాలని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. నిందితుడు హేమంత్పై పోలీసులు జరిపిన కాల్పుల ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. అలాగే ఈ పిటిషిన్పై కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని కూడా ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించి, ఈ విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.
నిందితుడు హేమంత్ అక్టోబర్ 31వ తేదీన పాఠశాలలోకి చొరబడి ఎలక్ట్రిక్ రంపంతో అమ్మాయిపై దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ దాడిలో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. సత్వర వైద్య సేవల వల్ల ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే చర్యలకు పూనుకుంది. పోలీసులు ఆత్మకూరు అడవిలో హేమంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం హేమంత్‌ని తీసుకెళ్లగా.. అక్కడ పోలీసు సిబ్బందిపై రాళ్లు విసిరి వారిని గాయపరిచాడని, దీంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరపగా అతని కాలికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే రక్తనాళాలు దెబ్బతినడం వల్ల గ్యాంగ్రీన్ ఏర్పడటంతో, అనంతపురం జిల్లా ఆస్పత్రిలోని వైద్యులు హేమంత్ కుడి కాలును తొలగించడం జరిగింది. నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే నిందితుడి హేమంత్పై పోలీసుల కాల్పలను అనుమానాలు వ్యక్తం చేస్తూ.. దీనిపై సీబీఐ విచార జరిపించాలని కోరుతూ మంగళగిరికి చెందిన న్యాయవాది గుండ గోపీకృష్ణ పిల్ వేశారు. కాగా ఈ కేసులో విద్యాశాఖ అధికారులను ప్రతివాదులుగా చేర్చాలన్న అభ్యర్థనను మాత్రం కోర్టు తిరస్కరించింది. ఈ పిల్ విచారణ సమయంలో నిందితుడు హేమంత్‌ను జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారని, అతనికి చికిత్స జరుగుతోందని ప్రత్యేక ప్రభుత్వ లాయర్ ఎస్.ప్రణతి కోర్టుకు తెలియజేశారు. నిబంధనల ప్రకారం, తొలగించిన కాలుకు ఫోరెన్సిక్ పరీక్ష జరుగుతోందని కూడా ఆమె వెల్లడించారు.
మొదటి వ్యాఖ్య రాయండి!