జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి
నేరాలు-ఘోరాలు
CRIME BEURO
3 గంటల క్రితం
AI సారాంశం
కుల్గాం : జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడి కలకలం రేపింది. కుల్గాం జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై
కుల్గాం : జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడి కలకలం రేపింది. కుల్గాం జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై బుధవారం ఉగ్రవాదులు దాడి చేశారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు.. భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. దీంతో సీఆర్పీఎఫ్ జవాన్లు ఎదురుకాల్పులు జరపగా.. ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు.ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. క్విక్ రియాక్షన్ టీమ్‌తో కలిసి క్యాంప్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేపట్టాయి. నిందితులను పాకిస్థానీ ముఠాకు చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు.
మొదటి వ్యాఖ్య రాయండి!